ఐదవ పుట్టిన రోజుని జరుపుకుంటున్న ట్విట్టర్: హ్యాపీ ట్వీటింగ్

By Super
|
ఐదవ పుట్టిన రోజుని జరుపుకుంటున్న ట్విట్టర్: హ్యాపీ ట్వీటింగ్
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వెబ్‌‌సైట్ తన ఐదవ పుట్టిన రోజుని మార్చి 21న అంటే నిన్న జరుపుకుంది. 2006లో ప్రారంభించినటువంటి ట్విట్టర్ అనతి కాలంలోనే అభివృద్ది చెందమడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాకి ఇన్పర్మేషన్ కానీ, న్యూస్ కానీ చేరవేయడంలో తనదైన పాత్రని పోషించింది. మార్చి 2006 మార్చి 21న ట్విట్టర్‌ని ప్రారంభించినటువంటి జాక్ డోర్సే, బిజ్ స్టోన్, ఇవాన్ విలియమ్స్ పంపించినటువంటి మొట్టమొదటి ట్వీట్ "inviting coworkers‌" అలా మొదలైంది ట్విట్టర్. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ట్విట్టర్‌ని ఫాలో అవ్వడం జరుగుతుంది.

ఒకానోక సందర్బంలో ట్విట్టర్ సిఈవో డిక్ కోస్టోలో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జనాభాకి అర్దం తెచ్చే విధంగా ట్విట్టర్ తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ రోజుకి దాదాపు 140 మిలియన్ ట్వీట్స్‌కు చేరుకుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా ట్విట్టర్‌ని ఓ ప్రసార మాద్యమంగా వాడుతున్నారు. ఏవైనా కొత్త న్యూస్ లేక ఇన్పర్మేషన్ పంచుకోవడం అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ట్విట్టర్ ఇప్పుడు ఓ ప్రెండ్‌షిప్ వెబ్‌సైట్ అయిపోయిందని అన్నారు.

 

2008వ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో బరాక్ ఒబామా తన ఐడియాస్‌ని, సమాచారాన్ని మాస్ జనాభాకు చేరవేసే విధంగా ట్విట్టర్‌ని వాడిన సంగతి తెలిసిందే. ఇంకోక విషయం ఏమిటంటే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ట్విట్టర్ ఇప్పటికీ ఓ ముఖ్యమైనటువంటి వార్తా ప్రసారంగా వాడుతున్నారంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మొన్నటికి మొన్న జపాన్‌లో సంభవించినటువంటి సునామీ, భూకంపం గురంచి బయట ప్రపంచానికి తెలియజేయడానికి అక్కుడన్నటువంటి మీడియాలు అన్ని సహాకరించని సమయంలో ట్విట్టర్ తనదైన పాత్రను పోషించింది. ఆ ఒక్కరోజులో జపాన్ సునామీ గురించి బయట ప్రపంచానికి 177 మిలియన్ ట్వీట్స్ పంపించడం జరిగింది.

దీనిని బట్టి మనకు తెలిసినది ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచంలో ట్విట్టర్ తనదైన శైలిలో న్యూస్‌ని, సమాచారాన్ని జనాభాకి అందవేస్తుంది. వన్ ఇండియా దట్స్ తెలుగు కూడా ట్విట్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రానున్న కాలంలో ట్విట్టర్ సమాచారాన్ని చేరవేయడంలో ఇంకా మేజర్ రోల్ పోషించాలని కోరుకుంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X