CoTweet పేరుతో Twitter లో మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌కు ప్ర‌యోగాలు!

|

ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ Twitter త‌న వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌ను తీసుకువ‌స్తోంది. తాజాగా Twitter సంస్థ కోట్వీట్ (CoTweet) పేరుతో స‌రికొత్త ఫీచ‌ర్ తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫీచ‌ర్‌కు సంబంధించి ఈ ఏడాది ఆరంభంలో రూమ‌ర్స్ వ‌చ్చినప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఇది ప్ర‌యోగ‌ ద‌శ‌లో ఉన్న‌ట్లు కంపెనీ నిర్ద‌రించింది. అంతేకాకుండా యూఎస్‌, కెన‌డా దేశాల్లో కొద్ది మంది యూజ‌ర్ల‌కు ఆ ఫీచ‌ర్ లైవ్‌లోకి వ‌చ్చిన‌ట్లు కంపెనీ వ‌ర్గాల వెల్ల‌డించాయి.

 
CoTweet పేరుతో Twitter లో మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌కు ప్ర‌యోగాలు!

అస‌లు ఈ CoTweet అంటే ఏంటంటే.. ఒక ట్విట‌ర్ యూజ‌ర్ తాను చేసే ట్వీట్‌కు స‌హ ర‌చ‌యిత‌గా మ‌రో వ్య‌క్తిని ఎంపిక చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డ‌మే దీని ముఖ్య ఉద్దేశం. త‌ద్వారా ఆ ట్వీట్ ఆ ఇద్ద‌రు వ్య‌క్తులకు సంబంధించిన‌దిగా ప్లాట్‌ఫాంపై క‌నిపిస్తుంది. సేమ్ ఇదే త‌ర‌హా ఫీచ‌ర్ ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

CoTweet ఎలా ప‌నిచేస్తుంది:
ఒక ట్విట‌ర్ యూజ‌ర్ తాను చేసే ట్వీట్‌కు స‌హ ర‌చ‌యిత‌గా మ‌రో వ్య‌క్తిని ఎంపిక చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డ‌మే ఈ కోట్వీట్ ముఖ్య ఉద్దేశం. ఉదాహ‌ర‌ణ‌కు ముందుగా ట్వీట్ చేసే యూజ‌ర్ త‌న‌ ట్వీట్‌కు స‌హ ర‌చ‌యిత‌గా మ‌రో వ్య‌క్తిని కోట్వీట్ అనే ఆప్ష‌న్ ద్వారా ఇన్వైట్ చేయాలి. అప్పుడు అవ‌త‌లి వ్య‌క్తి స‌ద‌రు వ్య‌క్తి యొక్క కోట్వీట్ ఇన్విటేష‌న్‌ను ధ్రువీక‌రిస్తేనే అది ప్లాట్‌ఫాంపై ఇద్ద‌రికి సంబంధించిన ట్వీట్‌గా ప‌బ్లిష్ అవుతుంది. రెండో వ్య‌క్తి కోట్వీట్ ఇన్విటేష‌న్‌ను అంగీక‌రించ‌క‌పోతే అది జ‌ర‌గ‌దు. ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు, లేదా సంస్థలు ఇత‌ర యూజ‌ర్ల‌తో త‌మ స్నేహాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా కొత్త‌ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

CoTweet పేరుతో Twitter లో మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌కు ప్ర‌యోగాలు!

ఈ ఫీచర్ ప్రస్తుతం US, కెనడా మరియు కొరియా వంటి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే లైవ్‌లో ఉంది. ఇది ఇంకా ప్ర‌యోగ స్థాయిలోనే ఉన్నందున‌ ఇంకా విస్తృతంగా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రాలేదు. "ట్విటర్‌తో ప్ర‌జ‌లు మ‌మేకం అవ‌డానికి మేము కొత్త మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తున్నాము. మా ప్లాట్‌ఫాంపై ఉన్న వ్య‌క్తులు లేదా బ్రాండ్ సంస్థ‌లు కొత్తగా ఫాలోవ‌ర్స్‌ను పెంచుకోవ‌డానికి ఇత‌ర యూజ‌ర్ల‌తో త‌మ స్నేహాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి కోట్వీట్ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఫీచ‌ర్ ను మ‌రిత ఉప‌యోగ‌క‌రంగా తీసుకువ‌చ్చేందుకు మేం ఇంకా మ‌రికొంత స‌మ‌యం దీనిపై ప్ర‌యోగాలు చేస్తున్నాం " అని ట్విట‌ర్ తెలిపింది. CoTweet చేసిన‌పుడు ఇద్ద‌రు ర‌చ‌యిత‌ల పేర్లు వారి ప్రొఫైల్ ఫొటోలు ప్లాట్‌ఫాంపై క‌నిపిస్తాయి.

CoTweet పేరుతో Twitter లో మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌కు ప్ర‌యోగాలు!

ట్విట‌ర్ నోట్స్ పేరుతో ఇటీవ‌లె మ‌రో ఫీచ‌ర్‌ను తెస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌ట‌న‌:
గ‌తంలో Twitter యూజ‌ర్లు ఆ ప్లాట్‌ఫాంపై ఏదైనా పోస్ట్ చేయాల‌నుకున్నప్పుడు కొన్ని ప‌రిమితులు ఉండేవి. పోస్టుల్లో నిర్ణీత ప‌దాల‌ వ‌ర‌కే రాసేందుకు అవ‌కాశం ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిమితి నుంచి ట్విట‌ర్ ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌నుంద‌ని స‌మాచారం. దాదాపు 2500 ప‌దాల వ‌ర‌కు రాసేందుకు అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా కొత్త ఫీచ‌ర్‌ను తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌యోగాలు జరుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్‌కు ట్విట‌ర్ నోట్స్ (Twitter Notes) అనే పేరు పెట్టిన‌ట్లు మీడియా వ‌ర్గాలు లీకులిచ్చాయి.

 

ఈ ఫీచ‌ర్ ప్ర‌త్యేక‌త‌లు:
ట్విట‌ర్ ప్ర‌వేశ పెట్ట‌నున్న ఈ కొత్త Notes ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు 2500 ప‌దాల వ‌ర‌కు త‌మ పోస్టుల్లో పొందు ప‌ర‌చ‌వ‌చ్చు. ఇదువ‌ర‌కు, Twitter యూజ‌ర్లు ఈ ప్లాట్‌ఫాం పై పోస్టు చేయాలంటే 280 ప‌దాల‌ పరిమితి ఉండేది. అంత‌ కంటే ఎక్కువ ప‌దాల‌తో ప్రకటన చేయాలనుకుంటే వారు టెక్స్ట్‌తో చిత్రాలను పోస్ట్ చేయాలి లేదా ఇత‌ర ఎక్స్‌ట‌ర్న‌ల్ లింక్‌లపై ఆధారపడాల్సి ఉండేది. కానీ ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఆ స‌మస్య తొల‌గ‌నుంది. యూజ‌ర్ తాను ఏం చెప్పాల‌నుకున్నాడో పూర్తిగా, వివ‌రంగా, స్ప‌ష్టంగా ఒకే పోస్ట్‌లో వెల్ల‌డించ‌వ‌చ్చు. ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఎక్కువ ప‌దాల‌తో విష‌యాల్ని పంచుకోవాల‌నుకునే యూజ‌ర్ల ల‌క్ష్యం నెర‌వేర‌నుంద‌ని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Twitter CoTweets feature: What it is, how it will work and other details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X