కొత్త రూల్స్‌తో యూజర్లకి షాకిచ్చిన ట్విట్టర్
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ట్విట్టర్ యూజర్లకు షాకిచ్చింది. ఇకపై ఒక రోజులో ట్విట్టర్ యూజర్లు కేవలం 400 అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వగలరు. దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై స్పామ్ (బల్క్) ఫా
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ట్విట్టర్ యూజర్లకు షాకిచ్చింది. ఇకపై ఒక రోజులో ట్విట్టర్ యూజర్లు కేవలం 400 అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వగలరు. దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై స్పామ్ (బల్క్) ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో స్పామర్ల అకౌంట్లను కట్టడి చేసేందుకు ట్విట్టర్ నిబంధనల్లో మార్పులు చేసింది.

ట్విట్టర్ అకౌంట్లో ఫాలోవర్లపై పరిమితి విధించింది. ఇప్పటివరకూ ట్విట్టర్ అకౌంట్లపై ఉన్న వెయ్యి ఫాలోవర్ల పరిమితిని 400 ఫాలోవర్లకు తగ్గించినట్టు శాన్ ఫ్రాన్సిస్ కో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ట్విట్టర్ అకౌంట్లలో మార్పులు
ఎవరిని ఎవరూ ఫాలో, అన్ ఫాలో అవుతారో చూద్దాం మంటూ ట్విట్టర్ ట్వీట్ చేసింది. స్పామర్స్ బెడదను తప్పించుకునేందుకు ట్విట్టర్ అకౌంట్లలో మార్పులు చేస్తున్నాం. ఇకపై రోజుకు మీరు వెయ్యి నుంచి 400 అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వగలరు. ఇది మీ మంచికేనంటూ ట్విట్టర్ ట్వీట్ చేసింది.

స్పామ్ కంటెంట్, అకౌంట్లను
ట్విట్టర్ ప్లాట్ ఫాంపై హెల్తీ సర్వీసును అందించాలనే ఉద్దేశంతో స్పామ్ కంటెంట్, అకౌంట్లను కట్టడి చేస్తున్నామని ట్విట్టర్ ప్రతినిధి ఎంగాడ్జెట్ తెలిపారు. ట్విట్టర్ అకౌంట్లపై రోజుకు ఫాలోయింగ్ పరిమితి ఉండాల్సిన దానికంటే భారీ సంఖ్యలో పెరిగిపోతున్నట్టు గుర్తించామన్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్ అకౌంట్లలో డెయిలీ ఫాలోయింగ్ రేట్ లిమిట్ ను తగ్గిస్తున్నట్టు చెప్పారు.

బల్క్ ఫాలోయింగ్ ట్రిక్స్
కొంతమంది యూజర్లు బాట్స్ ద్వారా బల్క్ ఫాలోయింగ్ ట్రిక్స్ అప్లయ్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. 2018 ఏడాదిలోనే ట్విట్టర్ బల్క్ ట్వీట్ యూజర్లను కట్టడి చేసింది. దీంతో ఒకే రకమైన కంటెంట్ ను ఇతర ట్విట్టర్ అకౌంట్లలో షేర్ కాకుండా అడ్డుకుంది.

రిపోర్టింగ్ టూల్స్ ద్వారా
కొత్త రిపోర్టింగ్ టూల్స్ ద్వారా యూజర్లు మాత్రమే ఇకపై ట్వీట్లు చేయగలరు. అందుకు వెరిఫికేషన్ ప్రాసెస్ అవసరం అవుతుంది. యూజర్లు తమ ఐడెంటీని ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ తో ధ్రువీకరించుకున్న తర్వాతే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications