Twitterలో త‌ప్పు ట్వీట్ చేశారా.. ఏం ప‌ర్లేదు, ఎడిట్ ఆప్ష‌న్ వ‌చ్చేస్తోంది!

|

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ Twitter ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేనుంది. ట్వీట్లను ఎడిట్ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణ యూజ‌ర్లే కాకుండా ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఆ ఫీచర్ కోసం అడుగుతున్నారు.

Twitter

ఈ క్ర‌మంలో Twitter ఎట్టకేలకు ఎడిట్ ట్వీట్ ఆప్షన్‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎడిట్ ట్వీట్ ఫీచర్ ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మేర‌కు కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఎడిట్ ట్వీట్ ఫీచ‌ర్ వినియోగం ఇలా:

ఎడిట్ ట్వీట్ ఫీచ‌ర్ వినియోగం ఇలా:

Twitter కొత్త ఎడిట్ ట్వీట్ ఫీచర్‌ను బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. స్పెల్లింగ్ తప్పులు, వాస్తవాలలో లోపాలు, వ్యాక‌ర‌ణ లేదా వాక్య నిర్మాణాల్లో లోపాలు స‌హా మరిన్ని చిన్న లోపాలు ఈ కొత్త ఫీచర్‌తో స‌వ‌రించుకోవడానికి అవ‌కాశం ల‌భిస్తుంది. ఎడిట్ ట్వీట్ ఫీచర్‌తో వినియోగదారులు తమ ట్వీట్‌లకు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించవచ్చు.

ప్రస్తుతం, కొత్త ఎడిట్ ట్వీట్ ఫీచర్ ను ఇప్పటికీ ఇంట‌ర్న‌ల్‌గా ప‌రీక్షిస్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. కేవలం ప‌లువురు ఎంపిక చేయ‌బ‌డిన Twitter వినియోగదారులకు మాత్రమే ఈ కొత్త ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ను టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంచింది. కొత్త ఎడిట్ ట్వీట్ ఫీచ‌ర్లోని సమస్యలను గుర్తించడానికి ఇంట‌ర్న‌ల్ టెస్టింగ్ ఎంతో ముఖ్యమైనదని ట్విట్టర్ వివరించింది.

ఈ ఫీచ‌ర్‌ను ఎలా వినియోగించాలి:

ఈ ఫీచ‌ర్‌ను ఎలా వినియోగించాలి:

కొత్త ఎడిట్ ట్వీట్ ఫీచర్ ఎలా పని చేస్తుంద‌నే విష‌యాన్ని కూడా Twitter బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. యూజ‌ర్లు తమ ట్వీట్‌లను పోస్ట్ చేసిన తర్వాత 30 నిమిషాల కాల ప‌రిమితిలో కొన్ని సార్లు ఎడిట్ చేసుకోవడానికి Twitter వినియోగదారులను అనుమతిస్తుంది. ట్వీట్‌ను ఎడిట్ చేసిన‌ తర్వాత, అది ఎడిటెడ్ టైమ్‌స్టాంప్ మరియు లేబుల్‌తో కనిపిస్తుంది. త‌ద్వారా ఒరిజిన‌ల్ ట్వీట్ సవరించబడిందని వీక్షకులకు తెలియ‌జేసేందుకు ఇది సహాయపడుతుంది.

"ఎడిట్ చేసిన ట్వీట్లు గుర్తుతో పాటు, టైమ్‌స్టాంప్ మరియు లేబుల్‌తో కనిపిస్తాయి.. కాబట్టి అసలు ట్వీట్ సవరించబడిందని ఫాలోవ‌ర్స్‌కు స్పష్టంగా తెలుస్తుంది. లేబుల్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా వీక్షకులు ట్వీట్ యొక్క మునుప‌టి ట్వీట్ ఎడిట్ హిస్ట‌రీకి వెళ్ల‌డం జ‌రుగుతుంది" అని ట్విట్టర్ బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

వివాదాస్ప‌ద లేదా త‌ప్పుడు పోస్టుల‌ను ఎడిట్ చేయ‌వ‌చ్చు!

వివాదాస్ప‌ద లేదా త‌ప్పుడు పోస్టుల‌ను ఎడిట్ చేయ‌వ‌చ్చు!

ఎడిట్ ట్వీట్ ఆప్ష‌న్ ఇంకా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యూజ‌ర్లు పోస్ట్ చేసిన ట్వీట్‌లో అక్షరదోషాలు లేదా చిన్న త‌ప్పులు ఉన్న‌ట్ల‌యితే.. వినియోగదారులు ట్వీట్‌ల మొత్తం థ్రెడ్‌లను తొలగించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ట్వీట్‌లో ఏదైనా వివాదాస్పదం ఉంటే ట్వీట్‌ను ఎడిట్ చేయ‌వ‌చ్చు. కానీ, ఎడిట్ చేసిన ట్వీట్‌ను హైలైట్ చేయడానికి ట్విట్టర్ ఒక ఐకాన్‌ను అందిస్తోంది. ఈ ఫీచ‌ర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది.. మరియు విస్తృత రోల్‌అవుట్‌కు ముందు Twitter దాని ఈ ఫీచ‌ర్ దుర్వినియోగాలు ఏమైనా ఉంటే వాటిని అరికట్టవచ్చు.

అదేవిధంగా, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లో Twitter వీడియోల‌ను ఏవిధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం:

అదేవిధంగా, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లో Twitter వీడియోల‌ను ఏవిధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం:

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2 : తరువాత 'Tweet2gif' యాప్‌ కోసం సెర్చ్ చేసి దాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు ట్విట్టర్‌ని ఓపెన్ చేసి మీకు నచ్చిన మరియు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో కోసం చూడండి.
స్టెప్ 4: ఇప్పుడు షేర్ బటన్‌పై క్లిక్ చేసి ఆ వీడియో లింక్‌ను అక్కడ నుండి కాపీ చేసుకోండి.
స్టెప్ 5: తరువాత 'Tweet2gif' యాప్‌ని ఓపెన్ చేసి డౌన్‌లోడ్ విభాగంలో లింక్‌ను పేస్ట్ చేయండి.
స్టెప్ 6: మీరు దీన్ని సాధారణ వీడియోగా డౌన్‌లోడ్ చేయాలనుకుంటే 'డౌన్‌లోడ్ MP4'పై క్లిక్ చేయండి లేదా లూప్‌లో ఉన్న సౌండ్ లేని వీడియోగా కావాలనుకుంటే 'డౌన్‌లోడ్ Gif'పై క్లిక్ చేయండి.
స్టెప్ 7: ఇప్పుడు ఈ వీడియో మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క గ్యాలరీ/ఫోటోల యాప్‌లో సేవ్ చేయబడుతుంది.

 

Best Mobiles in India

English summary
Twitter Finally Announces The Edit Tweet Feature; Here’s The Downside

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X