Twitter లో 'ఎడిట్' బటన్ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నది...

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో ఎక్కువ మంది ఖాళీ సమయాలలో సోషల్ మీడియాలలో గడుపుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం మీద మారుమూల ప్రాంతాలలో కూడా జరుగుతున్న అన్ని రకాల విషయాలను సోషల్ మీడియా ద్వారా తెల్సుకోవచ్చు. అధిక వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ ఒకటి. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం దాని వినియోగదారులను పోస్ట్ చేసిన తర్వాత వారి ట్వీట్‌లలో మార్పులు చేయడానికి అనుమతించదు. వినియోగదారులు ట్వీట్‌ చేసిన వాటిలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే దాన్ని డెలిట్ చేసి రీపోస్ట్ చేయవచ్చు లేదా అలాగే వదిలేయవచ్చు. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ త్వరలోనే ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌కు 'ఎడిట్' బటన్‌ను జోడించనున్నది. ఈ బటన్ సహాయంతో వినియోగదారులు తాము పంపుతున్న ట్వీట్లలో ఏవైనా తప్పులు ఉంటె కనుక సవరించడానికి అవకాశం ఉంటుంది.

 

ఎడిట్ బటన్‌ను నిర్ధారించిన ట్విట్టర్

ఎడిట్ బటన్‌ను నిర్ధారించిన ట్విట్టర్

ట్విట్టర్ సోషల్ మీడియా సంస్థ గత సంవత్సరం నుండి సురక్షితమైన పద్ధతిలో ఎడిట్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే నెలల్లో ట్విట్టర్ బ్లూ ల్యాబ్‌లతో పరీక్షించడం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని ట్విట్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్ తెలిపారు. అయితే ఈ ఫీచర్‌ను వినియోగదారుల కోసం విడుదల చేయడానికి ముందు ట్విట్టర్ పరిగణనలోకి తీసుకునే ఇన్‌పుట్ అంశాలు అనేకం ఉన్నాయి.

డెలిట్ చేసిన కాంటాక్ట్ నంబర్‌ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇలా చేయండిడెలిట్ చేసిన కాంటాక్ట్ నంబర్‌ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇలా చేయండి

ఎడిట్ ఫీచర్‌

సమయ పరిమితులు మరియు నియంత్రణలు లేకుండానే పబ్లిక్ సంభాషణల రికార్డులను మార్చడానికి వినియోగదారులు 'ఎడిట్' ఫీచర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది అని సుల్లివన్ తెలిపారు. అందువల్ల ఎడిట్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌కి రావడానికి మరింత కొంత సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది అని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో 9.2% వాటాను కొనుగోలు చేసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారారు. ట్విట్టర్ యాప్‌లో ఎడిట్ బటన్ కావాలనుకుంటున్నారా అని మస్క్ ఒక పోల్ నిర్వహించగా దానికి ప్రతిస్పందన ఎక్కువ మంది వినియోగదారులు ఎడిట్ బటన్‌ను కావాలని కోరుకుంటున్నారు.

ఎడిట్ బటన్
 

ఎడిట్ బటన్ వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం అప్లికేషన్‌లోకి అందుబాటులోకి రావలసిన ఫీచర్. కంపెనీకి దాని గురించి అధిక మొత్తంలో ఆందోళనలు ఉన్న కారణంగా ఇప్పటికి అందుబాటులోకి తీసుకొని రాలేదు. ట్విట్టర్ ఎడిట్ చేసిన ట్వీట్‌ని వినియోగదారులకు చూపుతుంది అలాగే ఎడిట్‌కు ముందు ఒరిజినల్ ట్వీట్‌ని చూసేందుకు వారికి ఒక ఎంపికను అందిస్తుంది. తద్వారా పబ్లిక్ రికార్డ్‌లు పూర్తి పారదర్శకతతో నిర్వహించబడతాయి మరియు ప్లాట్‌ఫారమ్‌లోని డేటా మరియు సంభాషణలను ఏ వినియోగదారుడు మార్చలేరు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Twitter Finally Brings Edit Button!! Since Last One Year Company Working on These Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X