ట్విట్టర్ ఇప్పుడు కుడి నుండి ఎడమ వైపుకి..!

Posted By: Prashanth

ట్విట్టర్ ఇప్పుడు కుడి నుండి ఎడమ వైపుకి..!

 

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ త్వరలో కొత్తగా కుడి వైపు నుండి ఎడమ వైపుకి రాసే భాషలు ఉర్దూ, పార్సీ, అరబిక్, హెబ్రీయిలను సపోర్ట్ చేయనుంది. కొత్తగా ట్విట్టర్ తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కంపెనీ ప్రతినిధులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ట్విట్టర్ సుమారు 13,000 మంది వాలెంటీర్స్‌తో మెను ఆప్షన్స్, సపోర్ట్ పేజీలను ఈ నాలుగు భాషలలో టెస్టు చేయించడం జరిగింది.

ట్విట్టర్ తలపెట్టిన ఈ కార్యక్రమం గురించి సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ ట్విట్టర్ ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకుందని.. దీని ద్వారా ట్విట్టర్ సర్వీసులను సమాన్య ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చని కొనియాడారు. ఈ భాషలు వచ్చే రాజకీయనాయకులు వారియొక్క దైనందిన విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవచ్చని తెలిపారు.

ట్విట్టర్‌కు చెందిన నాలుగు భాషల అధికారిక ట్రాన్షలేషన్ ప్రాసెస్‌లో సౌదీ బ్లాగర్, గ్రాస్ రూట్స్ కో ఫౌండర్‌తో పాటు, బిబిసి జర్నలిస్ట్, ఇరాన్‌కు చెందిన ఐటీ నిపుణులు పాల్గోన్నారు. ట్విట్టర్ ప్రవేశపెట్టనున్న కుడి వైపు నుండి ఎడమ వైపుకి కంటెంట్ వ్రాసే విధానం ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ 28 భాషలలో అందుబాటులో ఉంది. కొత్తగా ఈ నాలుగు భాషలను ప్రవేశపెట్టడం వల్ల ట్విట్టర్ ఉపయోగించే వారి సంఖ్య మరింతగా పెరగనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot