ఫేస్‌బుక్ మాదిరే ట్విట్టర్‌లో బ్రాండ్ పేజీలు..!

Posted By: Prashanth

ఫేస్‌బుక్ మాదిరే ట్విట్టర్‌లో బ్రాండ్ పేజీలు..!

 

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి కొత్త హాంగులను సంతరించుకోనుంది. ట్విట్టర్ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాబోయే కాలంలో ఫేస్‌బుక్ మాదిరే బ్రాండ్ పేజీలను ట్విట్టర్ కూడా కలిగి ఉండబోతుంది. ఈ బ్రాండ్ పేజీల వల్ల ట్విట్టర్ ఎకౌంట్‌ని కలిగి ఉన్న యూజర్స్ గేమ్స్‌ని ప్లే చేయవచ్చు. డిసెంబర్ 2011న ట్విట్టర్ కోకా కోలా, హెచ్‌పి కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ పేజీలను లాంఛనంగా విడుదల చేసింది. ఈ బ్రాండ్ పేజీలు చూసేందుకు అందంగా ఉండడమే కాకుండా.. కంపెనీ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా రూపొందించబడ్డాయి.

ఫిబ్రవరి1 నుండి ట్విట్టర్‌లో ఈ బ్రాండ్ పేజీలు దర్శనమివ్వడమే కాకుండా... వీటికి సంబంధించిన గేమ్స్‌ని కూడా యూజర్స్ ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఎలాగైతే బ్రాండ్ పేజీలను ప్రమోట్ చేస్తున్నారో ట్విట్టర్‌లో కూడా అదేవిధంగా ప్రమోట్ చేస్తారు. రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకోని ట్విట్టర్ యొక్క బ్రాండ్ పేజీలు అనుసంధానం చేయబడతాయి. మొదటి ఒక బ్రాండ్ శీర్షిక విక్రయదారులు వారి ట్యాగ్లైన్లు మరియు లోగోలు ప్రోత్సహించడానికి మరింత నెట్‌వర్క్‌ను ఉపయోగించేందుకు ఉచితంగా ఉంటుంది. రెండవది వారు పొందుపర్చిన ఒక ఫోటో లేదా వీడియో చూపే బ్రాండ్ యొక్క కాలపట్టిక ఎగువన నిర్దిష్ట ట్వీట్లు ప్రోత్సహించడతాయి.

కానీ ఇప్పటికీ మనసులో ఉన్న ప్రశ్న దీర్ఘ వ్యాపార దృష్టిలో గూగుల్ ప్లస్, లింక్డ్ ఇన్.. ట్విట్టర్ మాదిరే బ్రాడ్ పేజీలను రూపొందించి ఫేస్‌బుక్‌కి పోటీగా నిలుస్తాయని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot