గుప్త సమాచారం లీక్.. ట్విట్టర్‌పై దావా

Posted By: Super

గుప్త సమాచారం లీక్.. ట్విట్టర్‌పై దావా

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌గా గుర్తింపు పొందిన ట్విట్టర్‌పై బ్రెజిల్ గవర్నమెంట్ దావా వేసింది. ఇలా చేయడానికి గల కారణం బ్రెజిల్ ట్రాఫిక్ తనిఖీ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణలు తప్పించుకోవటానికి, పోలీసుల నిఘా ఇతర వివరాలు సంబంధించిన హెచ్చరికలను అందించడమే. దీనితో ట్విట్టర్ అందించిన హెచ్చరికలను బట్టి ప్రభుత్వం పోలీసులను వారి విధుల నుండి  డిచ్ఛార్జ్ చేసింది.

పైన విషయాలను పరిగణలోకి తీసుకొని, బ్రెజిల్ అటార్నీ జనరల్ తనిఖీ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణలు మరియు వేగం ఉచ్చుల యొక్క స్థానాల గురించి సమాచారం ట్వీట్ చేసిన వ్యక్తుల యొక్క ట్విట్టర్ ప్రొఫైల్స్‌ని వెంటనే సస్పెన్షన్ చేయాల్సిందిగా కేసు దాఖలు చేసింది. ప్రభుత్వానికి చెందిన ఇటువంటి సున్నితమైన సమాచారాన్ని ప్రజలు ఎవరు ట్వీట్ చేసిన రూ 50,000 జరిమానా విధించేలా కోరింది.

ట్విట్టర్‌లో 33.3 మిలియన్ల ఎకౌంట్స్‌ని కలిగి ప్రపంచంలో అతి రెండవ పెద్ద దేశంగా బ్రెజిల్ కొనసాగుతుంది. అత్యంత వేగంగా ట్విట్టర్ యూజర్స్ సంఖ్య  అభివృద్ది చెందుతున్న దేశంగా బ్రెజిల్  వార్తల్లోకెక్కింది.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot