హ్యాకింగ్‌కు గురైన ట్విట్టర్!

Posted By:

గత వారం రోజులుగా వివిధ మీడియా కంపెనీల పై హ్యాకింగ్ దాడులు ఉధృతమవుతున్న నేపధ్యంలో తమసైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు ట్విట్టర్ శుక్రవారం ఓ బ్లాగ్‌లో ప్రకటించింది. "మా వినియోగదారులను సురక్షితంగా ఉంచుకోవడానికి" అనే శీర్షికతో ప్రచురితమైన ఈ బ్లాగ్ పోస్ట్ వెబ్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఈ దాడుల ప్రభావం 2,50,000 అకౌంట్ల పై చూపినట్లు ట్విట్టర్ సమాచార భద్రతా విభాగపు సంచాలకులు బాబ్ లార్డ్ పేర్కొన్నారు. ఈ దాడులను ఆదిలోనే పసిగట్టగలిగామని తెలిపారు. హ్యాకింగ్‌కు గురైన సదరు ట్విట్టర్ అకౌంట్‌ల పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి సదరు హోల్డర్లకు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించినట్లు లార్డ్ పేర్కొన్నారు. తమ సెక్యూరిటీ వ్యవస్థని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బాబ్ లార్డ్ ఈ సందర్భంగా తెలిపారు.

మీ పాస్‌వర్డ్‌లు భద్రంగా ఉన్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆగడాల తలబొప్పి కట్టిస్తున్నాయి. ఇటీవల హ్యాకింగ్‌కు గురైన 6 మిలియన్‌లు లింకిడిన్ అకౌంట్ల ఉదంతాన్ని మరవక ముందే సైబర్ క్రిమినల్స్ బృందం 450,000 యాహూ అకౌంట్‌లను హ్యాక్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా అలజడి సృష్టిస్తున్న ఈ సైబర్ క్రిమినల్స్ రేపు మీ ఆకౌంట్ల పైనా దాడికి పాల్పడే అవకాశముంది. ఈ విధమైన దాడుల నుంచి మీ ఆకౌంట్‌లను రక్షించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు....

హ్యాకింగ్‌కు గురైన ట్విట్టర్!

- మీకున్న అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా వేరు వేరు పాస్‌వర్డ్‌లను కేటాయించండి.

- లావాదేవీలు ముగియగానే ఆకౌంట్‌ను సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు.

- యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి.

- లైబ్రరీ, ఇంటర్నెట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో మీ అకౌంట్ లను ఓపెన్ చేయకండి, ఒక వేళ చెయ్యాల్సి వస్తే పనిముగియగానే సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

- మీ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. గోప్యత పాటించండి.

- భద్రతలేని వై-ఫై కనెక్షన్లను ఉపయోగించే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకండి.

- పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చటం అవసరం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot