ఫాలోయింగ్ పేజిలో క్రొత్త బటన్‌ని యాడ్ చేసిన ట్విట్టర్

Posted By: Staff

ఫాలోయింగ్ పేజిలో క్రొత్త బటన్‌ని యాడ్ చేసిన ట్విట్టర్

ట్విట్టర్‌లో‌ ప్రాథమికంగా రెండు ప్రధానాంశాలను మనము గుర్తుంచుకోవాలి. అవి, మనం అనుసరించువారు (following) మరియు మనలను అనుసరించువారు (followers). మనం అనుసరించువారు (following) ఏవైనా ట్వీట్ (tweet) చేస్తే మనకు అవి కనిపిస్తాయి. అలాగే మన ట్వీట్లు (tweets) మనలను అనుసరించువారికి (followers) కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు ఎవరినైనా అనుసరించవచ్చు. మీరు ఎవరినైనా అనుసరించాలంటే వారు మీకు ఖచ్చితంగా తెలుసుండాలని లేదు. అలాగే మిమ్ములను అనుసరించే వారికి కూడా అది వర్తిస్తుంది. ఇవి బాగా గుర్తుకుంచుకున్న పక్షాన, ట్విట్టర్ లో మన గమనం సాఫీగా సాగుతుంది.

ఎవరిని ఐతే మీరు ఫాలో అవుతున్నారో వారియొక్క ట్విట్టర్ స్ట్రీమ్స్‌ని చూడడం కోసం, మీ ఫాలోవర్స్ కోసం ట్విట్టర్ పేజీలను గిజిబిజిగా చూడడానికి వీలు కల్పించేందుకు గాను ట్విట్టర్ ఓ క్రొత్త బటన్‌ని యాడ్ చేయడం జరిగింది. క్రొత్తగా యాడ్ చేసినటువంటి మిమ్మల్ని ఎవరైతే ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారో వారి యొక్క ట్వీట్స్ చదవడానికి ఈ బటన్ చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు గనుక మౌస్ పాయింటర్‌ని ఆ బటన్ మీద ఉంచినట్లైతే అది మీకు మీ ఫాలోవర్స్ లో ఉన్న వేరే వాళ్శ ట్వీట్స్‌పై జంప్ అవ్వడాన్ని చూపిస్తుంది.


దీనివల్ల మీరు రాండమ్‌గా మీరు ఫాలో అవుతున్న ఒక వ్యక్తి మీద క్లిక్ చేసినప్పుడు మీయొక్క స్ట్రీమ్స్ అక్కడ కనిపిస్తాయి. దీనివల్ల మీరు క్రొత్త ఫాలోవర్స్‌ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్రోత్త ఫీచర్‌ని ట్విట్టర్‌లో యాడ్ చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఖాలీగా ఉన్నప్పుడు ఈ క్రోత్త బటన్‌పై ప్రయోగాలు చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting