ట్విట్టర్ ఓ సోషల్ నెట్‌వర్కే కాదు.. ఓ శక్తి

Posted By: Staff

ట్విట్టర్ ఓ సోషల్ నెట్‌వర్కే కాదు.. ఓ శక్తి

 

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ కేవలం ఒక్క సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ మాత్రమే కాదు అంతకు మించి ఇంకా ఎక్కువేనని అంటున్నారు ట్విట్టర్ సహా వ్వవస్దాపకుడు జాక్ డోర్సే. ఇటీవల కాలంలో మార్కెట్లోకి వస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్ లాంటి వాటి నుండి ట్విట్టర్ భయపడాల్సింది ఏమీ లేదని అన్నారు. బిజినెస్ పరంగా దేనికుంటే విలువ దానికి ఉంటుందని అన్నారు.

ఇటీవల జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్నే ఆయన స్పష్టం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ నెట్ వర్కింగ్ అనేది ట్విట్టర్‌లో ఓ భాగంగా పేర్కోన్నారు. అందుకే ట్విట్టర్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌తో పాటు, పర్సనల్ న్యూస్ సర్వీస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ట్విట్టర్ వల్ల మరో ఉపయోగం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా అది తెచ్చేటటువంటి ట్వీట్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చన్నారు.

ఈ సామాజిక బ్లాగింగ్ వెబ్‌సైట్ ద్వారా జనాభా 140 క్యారెక్టర్స్ లాంగ్ మెసేజిని తమయొక్క ఫాలోవర్స్‌కి పంపవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌లో 100 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ కొనసాగుతున్నారు. 2011వ సంవత్సరానికి గాను ట్విట్టర్ సుమారు $140 మిలియన్ల రెవెన్యూని ఆర్జించినట్లు ప్రముఖ సర్వే సంస్ద ఈమార్కెటర్ వెల్లడించింది. జర్మనీలో ట్విట్టర్ తన కార్యకలాపాలను మరింత మెరుగు పరచుకునేందుకు అక్కడో టీమ్‌ని నెలకొల్పనుంది. ప్రత్యేకించి జర్మనీలో ట్విట్టర్ టీమ్‌ని నెలకొల్పడానికి కారణం అధిక గోప్యతా ఆందోళనలతో పాటు తక్కువ ట్విట్టర్ చర్యలు ఉండడమేనని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot