ట్విట్టర్ లోగో ఇక మాయం.. కొత్తగా X.com...!!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ కీలక ప్రకటనలు, మార్పులు చేస్తున్నారు. సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం నుంచి బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్, ట్విట్టర్ పోస్టుల లిమిట్ సహా కీలక మార్పులు చేస్తున్నారు. గతంలో ఓసారి ఏకంగా ట్విట్టర్ లోగోను మార్చివేశారు. అనంతరం కొద్ది గంటల్లోనే పాతలోగోను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే తాజాగా ఎలాన్ మస్క్ మరో కీలక చేశారు. ట్విట్టర్ లోగోను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ట్విట్టర్ లోగో పక్షి స్థానంలో X ఉంటుందని తెలిపారు. కొన్ని గంటల్లోనే ఈ మార్పులు గమనిస్తారని మస్క్ పేర్కొన్నారు. మరియు ట్విట్టర్‌ను రీబ్రాండ్ వెర్షన్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ట్విట్టర్ బర్డ్ లోగో 2012 నుంచి ఉంది.

ట్విట్టర్ డొమైన్‌లోనూ మార్పులు ఉంటాయని సమాచారం. X.comను టైప్ చేస్తే Twitter.com వెళ్లేలా మార్పులు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఎలాన్ మస్క్ సరికొత్తగా ప్రారంభించిన ఎక్స్ కార్ప్ అనే సంస్థలో ట్విట్టర్‌ను విలీనం చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం మస్క్ ప్రకటన చేశారు.
తన కార్యాలయాల్లో ఉన్న బర్డ్ లోగోను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ పని చాలా కాలం క్రితం చేయాల్సిందని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరియు ట్విట్‌లను X గా పిలుస్తామని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌తోపాటు ట్విట్టర్ ఇక నుంచి స్వతంత్ర సంస్థ కాదని.. X కార్ప్‌లో ఇటీవలే విలీనం చేయబడిందని వినియోగదారులు గుర్తించాలని ఎలాన్ మస్క్ సూచించారు.
త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్‌కు అనంతరం అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం అంటూ ఆదివారం ఉదయం మలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అధిక సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. మస్క్ ట్వీట్‌పై అనేక మంది యూజర్లు రీట్వీట్ చేశారు. తాము పక్షులను ఇష్టపడతామని ఒకరు ట్వీట్ చేశారు. ట్వీలాన్, టెస్లాన్ అని పిలుస్తారేమో అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
ట్వీట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. దాంతోపాటు బ్లూటిక్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చారు. తాజాగా కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది.
వెరిఫైడ్ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్ అకౌంట్ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్ తెరిచి వెరిఫైడ్ అకౌంట్ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.
అదే సమయంలో ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ పేరుతో యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ట్విట్టర్ తరహా చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఏకంగా అతికొద్ది రోజుల్లోనే 150 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. తక్కవ సమయంలో పెద్ద సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్న యాప్‌గా రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








