ట్విట్టర్ కొత్త టూల్.. ‘పాత ట్వీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’

Posted By: Prashanth

ట్విట్టర్ కొత్త టూల్.. ‘పాత ట్వీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’

 

ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.. గత సంవత్సరం మీరు చేసిన ట్వీట్‌లను తిరిగి చూడాలని ఉందా..?, మీ కోసం ఓ కొత్త టూల్‌ను ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే... ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్  ట్విట్టర్  ‘ఆర్చివ్ టూల్’ పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను ప్రకటించింది. ఈ  అప్లికేషన్  సాయంతో  యూజర్ తన పాత్ ట్వీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్‌లోడ్ చేసుకున్న పాత ట్వీట్‌లు ఓ స్ప్రెడ్ షీట్‌లో నిక్షిప్తం కాబడి ఉంటాయి. కావల్సిన ట్వీట్‌లను నెలలు వారీగా లేదా పదాల వారీగా సెర్చ్ చేసుకునేందుకు వీలుంటుంది.

యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

‘ఆర్చివ్ టూల్’ను పొందటం ఏలా..?

ముందుగా యూజర్ తన ట్విట్టర్ ఆకౌంట్‌లోని సెట్టింగ్స్ మెనూలోకి ప్రవేశించి  ట్విట్టర్ ఆర్చివ్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాతి చర్యగా ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత వివరాలతో కూడిన ఓ ఈ-మెయిల్ అందుతుంది. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఇంగ్లీష్ భాషను ఎంచుకున్న యూజర్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. త్వరలో మరిన్సి భాషలను ఈ టూల్ సపోర్ట్ చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot