Twitter లో 2,500 ప‌దాలతో పోస్టా! అలా చేయ‌డం సాధ్య‌మేనా..?

|

ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం Twitter మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌తంలో Twitter యూజ‌ర్లు ఆ ప్లాట్‌ఫాంపై ఏదైనా పోస్ట్ చేయాల‌నుకున్నప్పుడు కొన్ని ప‌రిమితులు ఉండేవి. పోస్టుల్లో నిర్ణీత ప‌దాల‌ వ‌ర‌కే రాసేందుకు అవ‌కాశం ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిమితి నుంచి ట్విట‌ర్ ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌నుంద‌ని స‌మాచారం. దాదాపు 2500 ప‌దాల వ‌ర‌కు రాసేందుకు అవ‌కాశం క‌ల్పించే దిశ‌గా కొత్త ఫీచ‌ర్‌ను తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌యోగాలు జరుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్‌కు ట్విట‌ర్ నోట్స్ (Twitter Notes) అనే పేరు పెట్టిన‌ట్లు మీడియా వ‌ర్గాలు లీకులిచ్చాయి. ఈ ఫీచర్ అధికారికంగా ఎప్పుడు విడుద‌ల అవుతుంది లేదా అంద‌రికీ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

 
Twitter లో 2,500 ప‌దాలతో పోస్టా! అలా చేయ‌డం సాధ్య‌మేనా..?

ఈ ఫీచ‌ర్ ప్ర‌త్యేక‌త‌లు:
ట్విట‌ర్ ప్ర‌వేశ పెట్ట‌నున్న ఈ కొత్త Notes ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు 2500 ప‌దాల వ‌ర‌కు త‌మ పోస్టుల్లో పొందు ప‌ర‌చ‌వ‌చ్చు. ఇదువ‌ర‌కు, Twitter యూజ‌ర్లు ఈ ప్లాట్‌ఫాం పై పోస్టు చేయాలంటే 280 ప‌దాల‌ పరిమితి ఉండేది. అంత‌ కంటే ఎక్కువ ప‌దాల‌తో ప్రకటన చేయాలనుకుంటే వారు టెక్స్ట్‌తో చిత్రాలను పోస్ట్ చేయాలి లేదా ఇత‌ర ఎక్స్‌ట‌ర్న‌ల్ లింక్‌లపై ఆధారపడాల్సి ఉండేది. కానీ ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఆ స‌మస్య తొల‌గ‌నుంది. యూజ‌ర్ తాను ఏం చెప్పాల‌నుకున్నాడో పూర్తిగా, వివ‌రంగా, స్ప‌ష్టంగా ఒకే పోస్ట్‌లో వెల్ల‌డించ‌వ‌చ్చు. ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఎక్కువ ప‌దాల‌తో విష‌యాల్ని పంచుకోవాల‌నుకునే యూజ‌ర్ల ల‌క్ష్యం నెర‌వేర‌నుంద‌ని తెలుస్తోంది.

Twitter లో 2,500 ప‌దాలతో పోస్టా! అలా చేయ‌డం సాధ్య‌మేనా..?

నోట్స్, ట్వీట్స్ ఒక‌టి కాదు!
అన్నింటిక‌న్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే.. Notes అనే ఫీచ‌ర్ మ‌రియు ట్వీట్ రెండూ ఒక‌టి కావు. ట్వీట్ల‌కు అద‌నంగా ఈ నోట్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్లు యాడ్ చేసుకోవ‌చ్చు అని స‌మాచారం. అదేవిధంగా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి ట్విట్టర్ UK, USA, కెనడా మరియు ఘనాలోని కొంతమంది వినియోగదారులతో క‌లిసి ప‌ని చేస్తోంది. ఈ ఫీచర్ అధికారికంగా ఎప్పుడు విడుద‌ల అవుతుంది లేదా అంద‌రికీ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌నే విష‌యం తెలియాల్సి ఉంది. ట్విట్టర్‌లో ట్వీట్స్ చూడటానికి మాత్రమే నెటిజన్లు ఆసక్తి చూపుతారని, అంత పెద్ద టెక్ట్స్‌ను చదివేందుకు ఆసక్తి చూపకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ట్విట‌ర్ ఈ ఫీచ‌ర్‌పై ప్ర‌ముఖంగా దృష్టి సారించ‌డం విశేషం.

Twitter లో 2,500 ప‌దాలతో పోస్టా! అలా చేయ‌డం సాధ్య‌మేనా..?
ఇప్ప‌టికే ప‌లు ఫీచ‌ర్ల‌పై క‌స‌ర‌త్తులు:
ఇదే కాకుండా మ‌రో రెండు కొత్త ఫీచ‌ర్లల‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు గ‌త ఏప్రిల్‌లో ప‌లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల్లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అవేంటంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ట్విట‌ర్ యూజ‌ర్లు ట్వీట్‌ చేసిన వాటిలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే దాన్ని డెలిట్ చేయాల్సి వ‌చ్చేది.. లేదా రీపోస్ట్ చేయడ‌మో, లేదా అలాగే వదిలేయ‌డ‌మో చేసేవారు. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ త్వరలోనే ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌కు 'ఎడిట్' (Edit) బటన్‌ను జోడించనున్నట్లు స‌మాచారం. ఈ బటన్ సహాయంతో వినియోగదారులు తాము పంపుతున్న ట్వీట్లలో ఏవైనా తప్పులు ఉంటె కనుక సవరించడానికి అవకాశం ఉంటుంది. ట్విట్టర్ సోషల్ మీడియా సంస్థ గత సంవత్సరం నుండి సురక్షితమైన పద్ధతిలో Edit ఫీచర్‌పై పని చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే కొద్ది నెలల్లో ట్విట్టర్ బ్లూ ల్యాబ్‌లతో పరీక్షించడం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని ట్విట్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్ తెలిపారు.

Twitter లో 2,500 ప‌దాలతో పోస్టా! అలా చేయ‌డం సాధ్య‌మేనా..?

* ఇదే కాకుండా Twitter Circle అని పిలువబడే కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షించడం ప్రారంభించింది. ఇది వినియోగదారులు ఎవరికి ట్వీట్ చేయాలనే దానిపై మరింత నియంత్రణను ఇస్తుంది. ఈ సర్కిల్‌లో భాగమైన వ్యక్తులు మాత్రమే వారిని చూడగలరు మరియు ప్రతిస్పందించగలరు. Twitter Circle మరింత నిర్దిష్టంగా మరియు మరింత వ్యక్తిగతంగా కనిపిస్తుంది. Twitter Circle అనేది వ్యక్తులను ఎంపిక చేయడానికి మరియు మీ ఆలోచనలను నిర్ణీత వ్య‌క్తుల‌తో పంచుకోవడానికి ట్వీట్లను పంపడానికి ఒక మార్గం గా ఉప‌యోగ‌ప‌డనున్న‌ట్లు తెలుస్తోంది.

 

మీ ట్విట‌ర్ అకౌంట్‌ను తాత్కాలికంగా డిలీట్ చేసుకోండిలా..
* * ముందుగా మీ ట్విట్టర్ ప్రొఫైల్‌కి వెళ్లి మెను చిహ్నంపై నొక్కండి.
** సెట్టింగ్‌స్ > ప్రైవసీ విభాగంకి వెళ్లండి.
** తరువాత "అకౌంట్" ఎంపికకి వెళ్లి, ఆపై "మీ అకౌంటును డియాక్టివేట్ చేయి" ఎంపికను ఎంచుకోండి. WhatsApp వాయిస్ కాల్‌లను ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో రికార్డ్ చేయడం ఎలా?
** "డియాక్టివేట్ చేయి" ఎంచుకోవడం ద్వారా మీరు మీ అకౌంటును డియాక్టివేట్చే యాలనుకుంటున్నారని నిర్ధారించి, ఆపై మళ్లీ నిర్ధారించండి. మీ అకౌంటును డియాక్టివేట్ చేసేటప్పుడు

మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో మొదటిది మీ డియాక్టివేషన్ విండో 30-రోజులు దాటితే కనుక మీ అకౌంట్ శాశ్వతంగా తొలగించబడుతుంది. కావున 30 రోజులలోపే అకౌంటును తిరిగి యాక్టివేట్ చేయాలి. అకౌంట్ ఒకసారి తొలగించిన తర్వాత మీరు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయలేరు. కావున మీ పాత ట్వీట్‌లకు యాక్సిస్ ను కోల్పోతారు.

Best Mobiles in India

English summary
Twitter Notes new feature to bring 2,500-word limit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X