జపనీస్ # టాగ్స్‌‌ని ఓకే చేసిన ట్విట్టర్

Posted By: Staff

జపనీస్ # టాగ్స్‌‌ని ఓకే చేసిన ట్విట్టర్

ట్విట్టర్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో అందరికి సుపరిచితం. మైక్రో బ్లాగింగ్ సైట్ అయినటువంటి ట్విట్టర్ అనతికాలంలో ఎంతో ఎత్తుకి ఎదిగింది. అలాంటి ట్విట్టర్‌లో మనం ఉపయోగించే 'యాష్ టాగ్స్' కీవర్డ్స్, టాపిక్స్‌కి సూచకాలు. ఏదైనా సింబల్ ముందు # పదాన్ని ఉపయోగించామంటే దాని అర్దం అంటే దీని ద్వారా ట్విట్టర్‌లో ఆ కీవర్డ్‌కి ఓ లింక్ ఏర్పడి అటువంటి పదాలకు సంబంధించిన అన్ని టాపిక్స్‌ని సెర్చ్ రిజల్ట్స్‌లో మీముందుకు తెస్తుంది.

జపనీస్ పదాలను స్పేస్ ద్వారా మనం సపరేట్ చేయలేం. అందుకోసం గాను యూజర్స్ మరికొన్ని ఎగస్ట్రా స్పేస్‌ #టాగ్‌కి ముందు, వెనుక భాగాన జత చేయాల్సి వస్తుంది. ఇక మీదట అలాంటి అవసరం లేకుండా ట్విట్టర్ చేసింది. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్‌లో ఇంటర్నేషనల్ కంట్రీ మేనేజర్‌లో నమోదు అయినటువంటి మొట్టమొదటి దేశంగా నమోదు కాబడింది. ఇటీవల జపాన్‌లో సునామీ సంభవించిన సమయంలో ట్విట్టర్ ద్వారా సర్వీస్‌ని అందించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ట్విట్టర్‌ని ఓ ప్రసార సాధనంగా వాడడం జరిగింది.

ట్విట్టర్ వెబ్ సైట్‌లో ఈ ఫీచర్‌ని జతచేయడం జరిగింది. ఎవరైనా జపాన్ దేశానికి చెందని క్లయింట్స్ ఉన్నట్లైతే వారు ట్విట్టర్ అఫీసియల్ అప్లికేషన్‌ని జత చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting