Twitter కొత్తగా ‘వైబ్ చెక్’ ఫీచర్‌పై పనిచేస్తోంది!! ఫేస్‌బుక్‌ యొక్క ఫీచర్‌కు అనుగుణంగా...

|

ప్రముఖ సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్విట్టర్ యొక్క యూజర్ బేస్ ని పెంచుకోవడం కోసం అనునిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా కొత్తగా మరొక ఫీచర్ ను ఫేస్‌బుక్ యొక్క "ఫీలింగ్స్" ఫీచర్‌తో పోల్చబడుతు అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నాలను చేస్తున్నది. యూజర్లు ఇకమీదట తమ యొక్క స్టేటస్ ని సెట్ చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా 'వైబ్ చెక్' ఫీచర్‌పై ట్విట్టర్ పనిచేస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

 

స్క్రీన్‌షాట్‌లను

యూజర్లు ఎవరైనా ట్వీట్‌ను టైప్ చేసే చోట "స్టేటస్ సెట్ చేయి" బాక్స్‌ను చూపించే ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్‌లను జేన్ మంచున్ వాంగ్ పరిశోధకుడు తన యొక్క ట్విట్టర్‌లో షేర్ చేసారు. మొదటి ఉదాహరణలలో భాగంగా "యమ్మీ రామెన్ తినడం" మరియు "Lurking Twitter" వంటివి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

WhatsApp కొత్త అప్‌డేట్!! గ్రూప్ వాయిస్ కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనడానికి మద్దతుWhatsApp కొత్త అప్‌డేట్!! గ్రూప్ వాయిస్ కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనడానికి మద్దతు

ట్విట్టర్‌లో ఏదైనా ఒక పోస్ట్‌కి వ్యక్తిత్వాన్ని జోడించడానికి ఇది అదనపు మార్గంగా కనిపిస్తోంది. వాంగ్ తన పేరు క్రింద "లిజనింగ్ టు ఎ. జి. కుక్" అనే ప్లేస్‌హోల్డర్ స్టేటస్ ని చూపిస్తూ ది వెర్జ్‌తో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉందొ లేదా కేవలం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందొ అనేదానిపై స్పష్టమైన వివరణ లేదు.

ట్విట్టర్
 

ట్విట్టర్ యొక్క కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ యొక్క "ఫీలింగ్స్" ఫీచర్‌తో పోల్చబడుతోంది. ఈ నెల ప్రారంభంలో ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరీక్షించడాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వినియోగదారులు పాల్గొనకూడదనుకునే సంభాషణలు లేదా చర్చల నుండి తమను తాము పేర్కొనకుండా ఉండటానికి వీలు కల్పిస్తుంది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ తన ట్విట్టర్ సేఫ్టీ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక చిన్న వీడియోలోని సారాంశం ప్రకారం కొత్త అన్‌మెన్షన్ బటన్ వినియోగదారులను నిర్దిష్ట ట్వీట్ నుండి తమను తాము అన్‌ట్యాగ్ చేయడానికి అనుమతించడమే కాకుండా అసలు ట్వీట్ మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల నుండి తమను తాము అన్‌ట్యాగ్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుందని చూపిస్తుంది.

అన్‌మెన్షన్ ఫీచర్

అన్‌మెన్షన్ ఫీచర్ అనేది ఇతర ట్విట్టర్ వినియోగదారులను అదే సంభాషణలో వినియోగదారులను మళ్లీ ప్రస్తావించకుండా నిరోధిస్తుంది. అలా కాకుండా సంభాషణ నుండి తమను తాము ప్రస్తావించని వినియోగదారులు సంభాషణకు సంబంధించిన నోటిఫికేషన్‌లను పొందలేరు. అయితే వారు ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం సంభాషణను చూడగలుగుతారు. అన్‌మెన్షన్ ఫీచర్‌ని మొదటిసారిగా జూన్ 2021లో ట్విటర్ టీజ్ చేయడం గమనార్హం. ఆ సమయంలో ట్విటర్ ప్రైవసీ డిజైనర్ డొమినిక్ కామోజీ ఫీడ్‌బ్యాక్‌ను ఆహ్వానిస్తున్నప్పుడు ఫీచర్ యొక్క 'కాన్సెప్ట్'ని షేర్ చేశారు.

ఎడిట్ బటన్‌ను నిర్ధారించిన ట్విట్టర్

ఎడిట్ బటన్‌ను నిర్ధారించిన ట్విట్టర్

ట్విట్టర్ సోషల్ మీడియా సంస్థ గత సంవత్సరం నుండి సురక్షితమైన పద్ధతిలో ఎడిట్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే నెలల్లో ట్విట్టర్ బ్లూ ల్యాబ్‌లతో పరీక్షించడం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని ట్విట్టర్ కన్స్యూమర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్ తెలిపారు. అయితే ఈ ఫీచర్‌ను వినియోగదారుల కోసం విడుదల చేయడానికి ముందు ట్విట్టర్ పరిగణనలోకి తీసుకునే ఇన్‌పుట్ అంశాలు అనేకం ఉన్నాయి.


ఎడిట్ బటన్ వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం అప్లికేషన్‌లోకి అందుబాటులోకి రావలసిన ఫీచర్. కంపెనీకి దాని గురించి అధిక మొత్తంలో ఆందోళనలు ఉన్న కారణంగా ఇప్పటికి అందుబాటులోకి తీసుకొని రాలేదు. ట్విట్టర్ ఎడిట్ చేసిన ట్వీట్‌ని వినియోగదారులకు చూపుతుంది అలాగే ఎడిట్‌కు ముందు ఒరిజినల్ ట్వీట్‌ని చూసేందుకు వారికి ఒక ఎంపికను అందిస్తుంది. తద్వారా పబ్లిక్ రికార్డ్‌లు పూర్తి పారదర్శకతతో నిర్వహించబడతాయి మరియు ప్లాట్‌ఫారమ్‌లోని డేటా మరియు సంభాషణలను ఏ వినియోగదారుడు మార్చలేరు.

 

Best Mobiles in India

English summary
Twitter Now Working on The ‘Vibe Check’ New Feature!! Like Facebook’s “Feelings” Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X