సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ యాప్, MacOS వాడే వారికి మాత్రమే

By Gizbot Bureau
|

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యాప్ MacOS యూజర్లకు శుభవార్తను అందించింది. ఈ యాప్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మళ్లీ తిరిగి రానుంది. ఆపిల్ ప్రాజెక్ట్ క్యాటలిస్ట్ ద్వారా మ్యా్క్ లోని iOS యాప్స్ లో ట్విట్టర్ యాప్ ప్రతక్ష్యం కానుంది. ట్విట్టర్ యాప్ ను మ్యాక్ ఓఎస్ లోకి ప్రవేశపెట్టేందుకు ట్విట్టర్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి గతవారం జరిగిన ఆపిల్ WWDC కాన్ఫిరెన్స్ సమయంలో ట్విట్టర్ ప్రకటించింది. క్యాటలీనాతో ట్విట్టర్ యాప్ MacOSలోకి రాబోతుందని వెల్లడించింది. అంతేకాదు.. కీబోర్డు షార్ట్ కట్స్, డార్క్ మోడ్, మల్టీపల్ విండోస్, నోటిఫికేషన్ లాంటి ఎన్నో ఫీచర్లను కూడా లాంచ్ చేయనుంది.

సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ యాప్, MacOS వాడే వారికి మాత్రమే

ఆరంభంలో ట్విట్టర్ కోసం Twitter for Mac app ఉండేది. అయితే ఈ యాప్ ను ఫిబ్రవరి 2018లో ట్విట్టర్ నిలిపివేసింది.అప్పటినుంచి రెండు వేర్వేరు కోడ్ బేసిడ్ యాప్ లా కొనసాగించలేక పోయింది. తాజా రిపోర్ట్ ప్రకారం క్యాటలిస్ట్ ప్రాజెక్టు సాయంతో కంపెనీ.. ఎగ్జిస్టింగ్ iOS కోడ్ బేస్ తో Desktops కోసం కొత్త ఫీచర్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం.. ట్విట్టర్ 'ఆల్ న్యూ యాప్’ అనే అప్లికేషన్ డెవలప్ చేయడంపై పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ macOS Catalinaపై పనిచేసేలా డెవలప్ చేసి ఈ ఏడాదిలో లాంచ్ చేయనున్నారు. ట్విట్టర్ ఇప్పటికే అనేక రకాల ఫీచర్లను విడుదల చేసింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

ట్విట్టర్ రిపోర్ట్

ట్విట్టర్ రిపోర్ట్

ట్విట్ట‌ర్‌లో యూజ‌ర్లు ఎవ‌రికైనా త‌ప్పుదోవ ప‌ట్టించే లేదా త‌ప్పుడు స‌మాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు క‌నిపిస్తే వాటిపై రిపోర్ట్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్ లేదా డెస్క్‌టాప్‌లో స‌ద‌రు ట్వీట్ల‌ కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో ఆ ట్వీట్ ఏవిధంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తుందో, అది యూజ‌ర్ల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుందో కామెంట్ ఎంట‌ర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

అకౌంట్ల‌ను బ్లాక్

అకౌంట్ల‌ను బ్లాక్

దీంతో అలాంటి త‌ప్పుదోవ ప‌ట్టించే ట్వీట్ల‌పై ట్విట్ట‌ర్‌కు రిపోర్ట్ వెళ్తుంది. ట్విట్ట‌ర్ టీం అందుకు స్పందించి.. ఆ ట్వీట్ల‌ను పరిశీస్తుంది. నిజంగానే ఆ ట్వీట్లు త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా , త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే ట్వీట్లుగా ఉంటే వాటిని వెంట‌నే తొల‌గిస్తారు. అలాంటి మిస్‌లీడింగ్ ట్వీట్ల‌ను పెట్టే వారి అకౌంట్ల‌ను బ్లాక్ చేస్తారు. కాగా ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం భార‌త్‌లోని ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు, యూర‌ప్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న‌ది.

బుక్ మార్క్స్

బుక్ మార్క్స్

ట్విట్టర్ యాప్‌లో యూజర్లు తమకు నచ్చిన ట్వీట్లను బుక్ మార్క్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ప్రతి ట్వీట్ కింద కొత్తగా షేర్ ఐకాన్‌ను ఏర్పాటు చేశారు. దానిపై ట్యాప్ చేస్తే వచ్చే మెనూలో ఉండే 'Add Tweet to Bookmarks' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సదరు ట్వీట్ యూజర్‌కు చెందిన ప్రొఫైల్‌లోని బుక్‌మార్క్స్ సెక్షన్‌లో సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన ట్వీట్‌ను యూజర్ తనకు కావాలనుకున్నప్పుడు బుక్‌మార్క్స్‌ను ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అనంతరం అవసరం లేదనుకుంటే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయవచ్చు.

 ఈ-మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల్లో షేర్

ఈ-మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల్లో షేర్

ట్విట్టర్‌లో పైన చెప్పిన ఫీచర్ మాత్రమే కాకుండా మరో కొత్త ఫీచర్‌ను కూడా యూజర్లకు అందిస్తున్నారు. ఇకపై ట్విట్టర్‌లో ఏ ట్వీట్‌నైనా ఈ-మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌లు లేదా డైరెక్ట్ మెసేజ్‌ల రూపంలో యూజర్లు షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్‌కు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫాంలలోనూ ఈ కొత్త ఫీచర్లు లభిస్తున్నాయి.

 రిప్లై కౌంటర్‌’, ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌’

రిప్లై కౌంటర్‌’, ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌’

ట్విట్టర్‌ మొబైల్‌ యాప్‌లో ‘రిప్లై కౌంటర్‌', ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌' అనే ఫిచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్‌ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే.. ట్విట్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్‌ ఆర్డర్‌లో కాకుండా వేరే విధంగా చూపిస్తాయి. ఈ ఫీచర్‌లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా.. ఒక ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం తెలుపుతాయి.

Best Mobiles in India

English summary
Twitter plans to bring back its app to MacOS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X