Home
News

ట్విట్టర్ 2021లో సంచలనం సృష్టించిన ట్వీట్ల గురించి పూర్తి వివరాలు..

2021 సంవత్సరం మరికొన్ని రోజులలో ముగియబోతోంది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు 2021లో భారతదేశంలోని టాప్ ట్రెండ్‌లను ట్విట్టర్ వెల్లడించింది. 2021లో అగ్ర ట్వీట్ లలో భారతదేశం యొక్క కోవిడ్-19 సహాయ నిధికి విరాళం గురించి ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ చేసిన ట్వీట్ అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్ అని ట్విట్టర్ తెలిపింది. 2021లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుమార్తె పుట్టినట్లు ప్రకటించిన ట్వీట్ ఈ ఏడాది దేశంలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్. అంతే కాకుండా #Covid19 మరియు #FarmersProtest హ్యాష్‌ట్యాగ్‌లు అత్యధికంగా ట్వీట్ చేయబడ్డాయి. 2021లో ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన మరిన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్

భారతదేశంలో కోవిడ్-19 సహాయ నిధికి విరాళంపై పాట్ కమిన్స్ చేసిన ట్వీట్ 2021లో భారతదేశంలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్. ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్ కూడా ఇదే. ఇప్పటివరకు, ఇది 487.1K లైక్‌లను, 114.2K రీట్వీట్‌లను మరియు 21.9K కోట్‌లను సంపాదించింది.

ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్

విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో తన మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతూ ఒక ట్వీట్ చేసాడు. తనకు బిడ్డ పుట్టినట్లు ప్రకటించిన అతని ట్వీట్ ఈ సంవత్సరం 50.7K రీట్వీట్‌లు, 539.1K లైక్‌లు మరియు 9421 కోట్‌లను సంపాదించి అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు ప్రకటించిన కోహ్లీ ట్వీట్ 2020లో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్ కావడం గమనార్హం.

ప్రభుత్వంలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్

ప్రధాని నరేంద్ర మోడీ తన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొందుతున్న చిత్రాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్ ఈ సంవత్సరం ప్రభుత్వంలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్ కావడం విశేషం. కోవిడ్-19 యుద్ధంలో తమ సహకారం అందించినందుకు వైద్యులు మరియు వైద్య సిబ్బందికి కూడా ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దీనికి 45.1K రీట్వీట్‌లు వచ్చాయి.

ప్రభుత్వంలో ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్

ఆసక్తికరంగా ఈ ఏడాది ప్రభుత్వంలో అత్యధికంగా లైక్ చేసిన ట్వీట్‌లో ప్రధానమంత్రి మోదీ ట్వీట్ టాప్ స్లాట్‌ను పొందింది. గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ విజయానికి భారత క్రికెట్ జట్టును అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఈ ఏడాది ప్రభుత్వంలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్ స్థానాన్ని దక్కించుకున్నది. దీనికి 297.9K లైక్‌లు వచ్చాయి.

ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం పట్ల మేమంతా ఆనందంగా ఉన్నాం. వారి అద్భుతమైన శక్తి మరియు అభిరుచి అంతటా కనిపించింది. అలాగే వారి నక్షత్ర ఉద్దేశం, విశేషమైన గ్రిట్ మరియు సంకల్పం. బృందానికి అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.

 

ఎంటర్‌టైన్‌మెంట్‌లో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్

దక్షిణ భారత నటుడు విజయ్ తన చిత్రం బీస్ట్ యొక్క ఫస్ట్ లుక్‌ను పంచుకుంటూ చేసిన ట్వీట్ ఈ సంవత్సరం ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్ లో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్ స్థానాన్ని దక్కించుకున్నది. ఇది 342.3K లైక్‌లు మరియు 140.3K రీట్వీట్‌లను సంపాదించి ఈ సంవత్సరం వినోదంలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్ కూడా ఇదే.

క్రీడల్లో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్

ఐపీఎల్‌లో MS ధోని మ్యాచ్ విన్నింగ్ ఆట కోసం విరాట్ కోహ్లీ చేసిన ప్రశంసల ట్వీట్ ఈ సంవత్సరం క్రీడలలో అత్యధికంగా రీట్వీట్ చేయబడిన ట్వీట్. 529.6K లైక్‌లు మరియు 91.7K రీట్వీట్‌లను సంపాదించి ఈ సంవత్సరం క్రీడలలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్ కూడా ఇదే.

More from GizBot

Best Mobiles in India

English summary
Twitter Reveals Most Retweet, Liked Tweets in india 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X