త్వరలో ట్విట్టర్ వీడియో ప్లేయర్

Posted By:

మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ త్వరలో తన సొంత వీడియో సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఫేస్‌బుక్ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌‍లలో అందుబాటులో ఉన్న వీడియో షేరింగ్ సర్వీస్ ఇప్పుడు ట్విట్టర్‌లోనూ అందుబాటులోకి రానుంది. తాము 2015లో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గతేడాది నవంబర్‌లోనే ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.

త్వరలో ట్విట్టర్ వీడియో ప్లేయర్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

త్వరలో అందుబాటులోకి రానున్న ట్విట్టర్ వీడియో సర్వీసులో భాగంగా 10 నిమిషాల నిడివితో కూడిన MOV, MP4 వీడియో ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త వీడియో సర్వీస్ గూగుల్ యూట్యూబ్‌తో పోటీపడనుందట. యూట్యూబ్ వీడియోలను సైతం ట్విట్టర్ వీడియో ప్లేయర్ సపోర్ట్ చేస్తుందట.

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ బంధాలను మరింత పటిష్టం చేసే క్రమంలో ప్రముఖ బ్లాగింగ్ డెవలపర్ ఇవాన్ విలియమ్స్ ‘ట్విట్టర్' పేరిట సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌ను మార్చి, 2006లో ప్రారంభించారు. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ నెట్ వర్కింగ్ సర్వీస్‌కు అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా షార్ట్ సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

సాధారణంగా చాలా మందికి ట్విట్టర్ గురించి "ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు? అనే విషయం తెలియదు. అలాంటి వారందరి కోసం వన్ ఇండియా ప్రత్యేకంగా ట్విట్టర్ గురించిన సమాచారం, ట్విట్టర్ ఎలా వాడాలో సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్విట్టర్‌లో‌ ప్రాథమికంగా రెండు ప్రధానాంశాలను మనము గుర్తుంచుకోవాలి. అవి, మనం అనుసరించువారు (following) మరియు మనలను అనుసరించువారు (followers). మనం అనుసరించువారు (following) ఏవైనా ట్వీట్ (tweet) చేస్తే మనకు అవి కనిపిస్తాయి. అలాగే మన ట్వీట్లు (tweets) మనలను అనుసరించువారికి (followers) కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు ఎవరినైనా అనుసరించవచ్చు.

English summary
Twitter's built-in video player runs 10 minutes of high-quality footage. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot