అక్కడ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ట్విట్టర్

Posted By: Staff

అక్కడ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ట్విట్టర్

దక్షణ కోరియా దేశంలో రోజు రోజుకీ ట్విట్టర్ వాడకం దారులు పెరిగిపోతున్నారు అనడానికి ఈ చిన్న ఉదాహారణ సరిపోతుంది. మొత్తం దక్షణ కొరియా జనాభాలో ట్విట్టర్ వాడేటటువంటి వారు 3.34 మిలియన్ జనాభా ఉండగా, ప్రతి రోజూ 3 మిలియన్ ట్వీట్స్‌ని షేర్ చేసుకుంటున్నారని దక్షణ కొరియాలో ఉన్న ఓ ప్రముఖ పత్రిక వ్యాసాన్ని ప్రచురించింది.

వివరాల్లోకి వెళితే మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌ని ఉపయోగించేటటువంటి 10, 000 మంది జనాభాతో కొరియాకు చెందిన మీడియా అడ్వర్టైజర్స్ అసోషియేషన్, మీడియా రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా డేటాని సేకరించడం జరిగింది. ఈ సర్వేలో 8.6శాతం మంది ట్విట్టర్‌కే ఓటు వేయడం జరిగింది. ఈ సర్వే‌ని ప్రతి వారంలో ఒకసారి నిర్వహిస్తామని సదరు నిర్హాకులు వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ రోజుకీ 200మిలియన్ ట్వీట్స్‌ని పంపడం జరుగుతుందని ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఫిగర్‌తో పొల్చుకుంటే 3మిలియన్ అనేది చాలా తక్కువ నెంబర్ అయినప్పటికీ, దేశంలో మాత్రం ట్విట్టర్ ఎక్కువ పాపులారిటీని పొందడం సంతోషించే విషయమని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ట్విట్టర్ సర్వీస్ దక్షణ కొరియాలో ఉన్న యంగ్ కస్టమర్స్‌ని బాగా ఆకర్షించడం జరిగింది. ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్న ఎక్కవ మంది జనాభాలో 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మద్య లోపు కలవారే ఎక్కవ కావడం విశే షం.

దక్షణ కొరియాకు చెందిన లోకల్ వర్సన్ ట్విట్టర్ ఎకౌంట్‌ని జనవరిలో ప్రారంభించడం జరిగింది. మొదట్లో కొరియన్స్ మనసు గెలుచుకొవడానికి గాను ట్విట్టర్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదంటే నమ్మండి. అంతలా కాంపిటేషన్‌ని ఎదుర్కొవడానికి గల కారణం అప్పటికే కొరియాలో ఉన్న సోషల్ నెట్ వర్క్స్ నెంబర్ వన్ స్దానంలో ఉండడమే. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎకౌంట్‌ని ఉపయోగిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot