ట్విట్టర్‌లో బూతు భాగోతం.. ఆకౌంట్లు మూసివేత!

By Prashanth
|
Twitter


లండన్: చిన్నారుల అసభ్య చిత్రాలను అప్‌లోడ్ చేసిన పలు అకౌంట్‌లను మైక్రో - బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మూసివేసినట్లు స్కై న్యూస్ వెల్లడించింది. ఈ అకౌంట్‌ల భాగోతం పై గ్రేటర్ మ్యాంచెస్టర్ పోలీస్ అలానే నార్త్ యార్క్‌షైర్ పోలీసులకు ప్రజల నుంచి ఫిర్యాదులందినట్లు సదరు మీడియా పేర్కొంది. ఆశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేసిన అనుమానస్పద అకౌంట్‌లు బ్రిటెన్‌కు చెందినవా కాదా అన్నఅంశం పై స్పష్టత రావల్సి ఉంది. ఈ అంశం పై బాలల దోపిడి ఇంకా ఆన్‌లైన్ పరిరక్షణ కేంద్రం స్పందిస్తూ తమకు 30 రిపోర్టులు అందాయని, వెంటనే స్పందించిన ట్విట్టర్ సదరు ఆకౌంట్‌లను నిలిపివేసిందని పేర్కొంది. తమ సైట్‌లో చిన్నారుల ఆశ్లీల సాహిత్యాన్ని ఉపేక్షించేదిలేదని, ఈ విధమైన చర్యలకు ఎవరైనా పూనుకున్నట్లయితే వారికి తెలియపరచకుండానే అటువంటి చిత్రాలను తొలగిస్తామని ట్విట్టర్ ఈ మేరకు ఓ ప్రకటనను వెలువరించింది.

షేపులు పిచ్చెక్కిస్తున్నాయ్!

సూపర్ కంప్యూటర్స్ (టాప్-10)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X