ఫేక్ ఎకౌంట్‌కి ట్విట్టర్ క్షమాపణ..!

Posted By: Staff

ఫేక్ ఎకౌంట్‌కి ట్విట్టర్ క్షమాపణ..!

 

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్  ట్విట్టర్ సెలబ్రిటీల ట్విట్టర్ పేజిని మొదటగా సరిచూచి ఆ తర్వాత ఎకౌంట్‌కి బ్లూ టిక్ మార్క్‌ని అనుసంధానం చేస్తుంది. ప్రపంచపు మీడియా మొగల్ రూపెర్ట్ ముర్డోచ్ ట్విట్టర్ ఎకౌంట్‌ని అదే విధంగా సరిచూచి బ్లూ టిక్ మార్క్‌ని అనుసంధానం చేసింది. ఐతే ఇటీవల న్యూస్ కార్పోరేషన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ 'రూపెర్ట్ ముర్డోచ్' భార్య 'వెండీ డెంగ్' పేరు మీద మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్  ట్విట్టర్‌లో @Wendi_Deng అంటూ ఓ ఎకౌంట్ దర్శనమిచ్చింది.

ఈ ఎకౌంట్‌ ఖచ్చితమైనదంటూ ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్‌ని ఎకౌంట్‌కి అనుసంధానం చేసింది. ఐతే వెండీ డింగ్ మాత్రం 2012 కొత్త సంవత్సర శుభాకాంక్షలతో తాను కొత్తగా ట్విట్టర్ ఎకౌంట్‌ని ప్రారంభిస్తున్నట్లు తెలుపగా ట్విట్టర్ యాజమాన్యం ఒక్కసారిగా ఖంగుతింది. ఇది మాత్రమే కాదండోయ్ గతంలో ఉన్న @Wendi_Deng ఫేస్ ఎకౌంట్‌గా  తేల్చి దానికి అనుసంధానం చేసిన బ్లూ టిక్ మార్క్‌ని తీసి వేయడం జరిగింది.

ఈ విధంగా వెండీ డెంగ్‌ ఫేస్ ఒరిజినల్ ఎకౌంట్‌ని అతి తక్కువ సమయంలో సరిచూసి దానికి బ్లూ టిక్ అనుసంధానం చేయడమే కాకుండా, గతంలో @Wendi_Deng అనే ఫేక్ ఎకౌంట్‌ ఓరిజినల్ ఎకౌంట్ అంటూ బ్లూ టిక్ మార్క్‌ని అమర్చినందుకు ట్విట్టర్ యాజమాన్యం 'రూపెర్ట్ ముర్డోచ్'‌కి క్షమాపణలు తెలిపింది. కేవలం 48 గంటల్లో వెండీ డెంగ్ ఎకౌంట్‌ని సరిచూసి ట్విట్టర్ స్టాంప్‌ని అమర్చి Wendi Deng Murdoch గా ఎకౌంట్‌ని మార్పు చేశారు.


Wendi Deng Murdoch ఎకౌంట్‌ని యాక్టివేట్ చేసిన కొన్ని గంటలలోపే 10,000 ఫాలోవర్స్ లిస్ట్‌లో చేరారు. ఈ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెండీ డెంగ్ ముడ్రోచ్ తన పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్‌లో జరిగిన కొన్ని విశేషాలను ప్రపంచానికి తెలియజేయనున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting