Twitter లో ఉద్యోగుల తొలగింపులు షురూ.. షాకివ్వనున్న కంపెనీ నిర్ణయం!

|

ఎలన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ Twitterను కొనుగోలు చేసిన తర్వాత అనేక కీలక మార్పులు చేపడుతున్నారు. అందులో భాగంగా ఆయన ట్విటర్ ద్వారా భారీగా ఆదాయంపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ ఉద్యోగుల భారీ తొలగింపులలో భాగంగా భారతదేశంలోని 200 మందికి పైగా ఉద్యోగులను Twitter తొలగించినట్లు తెలుస్తోంది.

Twitter

Twitterఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఇంజినీరింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ టీమ్‌లలో తొలగింపులు జరుగుతున్నాయని పలు మీడియా వర్గాలు తెలిపాయి. అయితే, భారతదేశంలో తొలగించబడిన ఉద్యోగులకు చెల్లించాల్సిన విభజన ప్యాకేజీపై ఇంకా స్పష్టత లేదు.

భారతదేశంలో మొత్తం మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ను తొలగించినట్లు సంబంధిత వర్గాలు సమాచారం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్త మస్క్ గత వారం ట్విట్టర్‌లో తన ఇన్నింగ్స్‌ను CEO పరాగ్ అగర్వాల్‌తో పాటు CFO మరియు మరికొందరు ఉన్నతాధికారులను తొలగించడం ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. మస్క్ ఇప్పుడు కంపెనీ యొక్క గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి భారీ కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం.

ఈ తొలగింపులకు సంబంధించి ట్విటర్ ఇండియాకు చెందిన ఓ ఉద్యోగి మీడియాతో ఈ విధంగా స్పందించారు. "లేఆఫ్ ప్రారంభమైంది. నా సహోద్యోగులలో కొందరికి దీనికి సంబంధించి ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చింది" అని ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు. అయితే, ఉద్యోగాల కోతకు సంబంధించిన స్పష్టత కోసం పలు మీడియా వర్గాలు ఇమెయిల్ ద్వారా సంప్రదించగా.. ట్విట్టర్ ఇండియా నుంచి స్పందన లభించలేదని తెలుస్తోంది.

Twitter

ట్విటర్ ఉద్యోగులకు అంతకుముందు అంతర్గత పంపిన ఇమెయిల్‌లో ఈ విధంగా పేర్కొంది. "ట్విట్టర్‌ను మంచి మార్గంలో తీసుకెళ్లడంలో భాగంగా, మేము మా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్తాము" అని పేర్కొంది. "ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఇమెయిల్‌ను స్వీకరిస్తారు" అని పేర్కొంది. అదేవిధంగా, ఉద్యోగుల భద్రతతో పాటు ట్విట్టర్ సిస్టమ్‌లు మరియు కస్టమర్ డేటా కోసం కంపెనీ అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపినట్లు సమాచారం. "మీరు కార్యాలయంలో ఉన్నట్లయితే లేదా మీ కార్యాలయానికి వెళుతున్నట్లయితే, దయచేసి ఇంటికి వెళ్లొచ్చు" అని ట్విట్టర్ పేర్కొంది.

ఏదేమైనప్పటికీ.. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7,500 మంది హెడ్‌కౌంట్‌లో కంపెనీ 3,738 మందిని తొలగిస్తున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Twitter

అదేవిధంగా, Twitterలో వెరిఫైడ్ అకౌంట్ల ప్రక్రియలో మార్పుల గురించి కూడా తెలుసుకుందాం;
ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ ట్విటర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేస్తానని ప్రకటించినప్పటి నుండి ఆ ప్లాట్ ఫారమ్ పంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షిస్తోంది. మస్క్ కంపెనీ టేకోవర్‌ను పూర్తి చేసి, అప్పటి CEO పరాగ్ అగర్వాల్‌ను తొలగించి, ప్రస్తుతానికి ఆ స్థానాన్ని తానే స్వీకరించాడు. అంతేకాకుండా, ఆయన కంపెనీలో పలు కీలక మార్పులను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవల ఆయన వెరిఫికేషన్ (బ్లూ టిక్) ఖాతాల విషయంలో సబ్ స్క్రిప్షన్ ఫీచర్ తేనున్నట్లు కూడా ప్రకటించారు.

తాజాగా, ఎలోన్ మస్క్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ యొక్క కొత్త ధరను అధికారికంగా ధృవీకరించారు. ప్లాట్‌ఫారమ్‌పై బ్లూ టిక్‌ని కోరుకునే ఎవరైనా ఇప్పుడు దాన్ని పొందవచ్చు అని తెలుస్తోంది. కొత్త వ్యవస్థ ఇంకా అమలు చేయబడలేదు కానీ అమలుకు కంపెనీ తీవ్రంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ.. ట్విటర్ లో బ్లూ టిక్ పొందడానికి ధరను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఎలోన్ మస్క్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధరను ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ అనేది ప్రొఫైల్‌లను ధృవీకరించడానికి అవసరమైనది. చందా వినియోగదారులకు పొడవైన వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. మరియు ప్రత్యుత్తరాలు, ప్రస్తావనలు మరియు సెర్చింగ్లలో ప్రాధాన్యతను పొందుతుంది. ట్విట్టర్ బ్లూ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చవుతుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ట్విట్టర్ బ్లూ మరియు ట్విట్టర్ ధృవీకరణ పై ఎలోన్ మస్క్ ట్వీట్లు;
Twitter తిరిగి 2009లో వెరిఫికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్లాట్‌ఫారమ్ 2021లో Twitter బ్లూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను జోడించింది. Twitter చందా కోసం నెలకు $4.99 అడుగుతోంది. కానీ, రాబోయే రోజుల్లో Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్ నెలకు $8 ఖర్చు అవుతుందని ఎలోన్ మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా త్వరలో అందుబాటులోకి రావచ్చు. మస్క్ ప్రారంభంలో $20/నెలకు సూచించాడు, కానీ స్టీఫెన్ కింగ్‌తో అతని పరస్పర చర్య తర్వాత అతను అడిగే ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.

Twitter బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ధృవీకరించబడిన ఖాతాను సూచించే బ్లూ టిక్ చెక్‌మార్క్‌ను మాత్రమే కాకుండా కొన్ని ప్రయోజనాలు మరియు పెర్క్‌లను కూడా పొందగలరు. చందాదారులు పొందే ప్రయోజనాలను మస్క్ ధృవీకరించారు.

Best Mobiles in India

English summary
Twitter started giving huge Layoffs to the company employees.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X