లక్షా 25 వేల అకౌంట్లకు రాంరాం చెప్పిన ట్విట్టర్

Written By:

ట్విట్టర్ వేదికగా ఉగ్రవాదులు సాగిస్తున్న హింసా కాండకు ట్విట్టర్ ముగింపు పలికింది .వారి అకౌంట్లను సీజ్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న 1.25 లక్షల ఎకౌంట్లను సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ట్విట్టర్‌ను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు తమ విధానం అనుమతించందని ఆ సంస్థ ట్వీట్ చేసింది.

లక్షా 25 వేల అకౌంట్లకు రాంరాం చెప్పిన ట్విట్టర్

2004 లో మూణ్నెళ్ల కాలంలో ఐఎస్‌కు సంబంధించి ట్విట్టర్‌లో 46 వేల ఎకౌంట్లు ఉన్నాయి. ఆ తర్వాత 2005 నుంచి వీటి సంఖ్య క్రమేణా పెరిగింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా వీటిని గుర్తించి సస్పెండ్ చేశారు.

లక్షా 25 వేల అకౌంట్లకు రాంరాం చెప్పిన ట్విట్టర్

ట్విట్టర్‌లో ఖాతాదారులు పోస్ట్ చేసే అభ్యంతకర కామెంట్లపై నిశిత పరిశీలన ఉంటుంది. పిల్లల అశ్లీల సాహిత్యం నిరోధించడానికి ఇంతకుముందే ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ట్విట్టర్‌లో 50 కోట్ల మంది ఖాతాదారులున్నారు.

Read more : టెర్రర్ కేసుతో షాకయిన ట్విట్టర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి

రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త. ట్విటర్ లో పోస్ట్ చేసి, తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్విటర్ తో పొలిట్ వూప్స్ వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకుంది.

 

 

వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని

తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అసలు వారేమన్నారో ప్రజలకు తెలియకుండా పోతోంది. ఇలా తొలగించిన ట్వీట్లను పొలిట్ వూప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు.

అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్

భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో ఈ సేవలను మళ్లీ ప్రారంభించనుందని సీనెట్ డాట్ కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్ నడుపుతున్న పొలిట్ వూప్స్ వైబ్ సైట్ ను నెదర్లాండ్ కు చెందిన పారదర్శక సంస్థ ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

 

 

తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్

పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు అందించింది. అయితే తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్ ఇచ్చేందుకు ట్విటర్ నిరాకరించడంతో గతేదాడి నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి.

ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా

ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా తాము జరిపిన చర్చలు ఫలించడంతో మరోసారి ఈ సేవలు ప్రారంభించనున్నామని ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు

సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. అయితే ట్విటర్ లో తొలగించిన ట్వీట్లను తిరిగి పోస్ట్ చేస్తుందా అనేది స్పష్టం కాలేదు.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Twitter suspends over 125,000 accounts for 'promoting terrorist acts
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot