2011 టాప్ లిస్ట్‌లో ట్విట్టర్..?

Posted By: Prashanth

2011 టాప్ లిస్ట్‌లో ట్విట్టర్..?

 

2011వ సంవత్సరానికి గాను సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఏ వెబ్ సైట్ బెస్ట్ అంటూ నిర్వహించిన ర్యాంకింగ్స్‌లలో ట్విట్టర్ మొదటి స్దానాన్ని కైవసం చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, జీటా బజ్ స్కోర్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అందరూ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో టాప్ వెబ్ సైట్ అంటే ఫేస్‌బుక్ అనుకునే వారు. కానీ ఒక్కసారిగా ఈ ర్యాంకింగ్‌తో ఫేస్‌బుక్ నాల్గవ స్దానంలోకి దిగజారడంతో అందరూ ఆశ్యర్యపోయారు.

మొదటి స్దానంలో ట్విట్టర్ నిలవగా, రెండు స్దానంలో ఫేస్‌బుక్‌కి పోటీగా సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ విడుదల చేసిన గూగుల్ ప్లస్ నిలిచింది. మూడవ స్దానాన్ని లింక్డ్ ఇన్ కైవసం చేసుకోగా, నాల్గవ స్దానాన్ని ఫేస్‌బుక్  కైవసం చేసుకుంది. ట్విట్టర్ మొదటి స్దానంలో నిలవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రపంచంలో ఉన్న కొన్ని మిలియన్లు బ్లాగ్స్, సోషల్ మీడియా వెబ్ సైట్స్‌కి ట్విట్టర్ అనుసంధానం కాబడి ఉంది. అంతేకాకుండా ట్విట్టర్‌ ప్రారంభించినప్పటి నుండి కూడా ఎక్సక్లూజివ్ న్యూస్‌తో పాటు, పాజిటివ్‌గా అభివృద్ది చెందుతూ వచ్చింది.

రెండవ స్దానంలో ఉన్న లింక్డ్ ఇన్ విషయానికి వస్తే పోయిన సంవత్సరం ఏడవ స్దానంలో ఉంటే ఈసారి రెండవ స్దానాన్ని కైవసం చేసుకుంది. మరో సోషల్ మీడియా నెట్ వర్క్ వెబ్ సైట్ మీట్ అప్ ఈసారి ఆరవ స్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2010వ సంవత్సరంలో సత్తా చాటిన యూట్యూబ్, ఫ్లిక్కర్ ఈసారి వెనకుబడి పోయాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot