ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

Written By:

మైక్రో బ్లాగింగ్ వెబ్‌‌సైట్ తన 10 పుట్టిన రోజును నేడు జరుపుకుంటోంది. ఈ సంస్థను మార్చి 21, 2006లో ప్రారంభించారు. కమ్యూనికేషన్ బంధాలను మరింత సులభతరం చేసే క్రమంలో ప్రముఖ బ్లాగింగ్ డెవలపర్ ఇవాన్ విలియమ్స్ ట్విట్టర్‌ను ప్రారంభించారు. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ నెట్‌వర్కింగ్ సర్వీస్‌కు అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా షార్ట్ సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌కు పదేళ్లు,  ఆసక్తికర విషయాలు

సోషల్ మీడియాలో రోజురోజుకు పెరగుతోన్న పోటీ నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ తమ డైరెక్ట్ మేసేజ్‌ల పరిధిని 160 క్యారెక్టర్ల నుంచి 10 వేల క్యారెక్టర్లకు పెంచింది. అంటే, ఇక పై ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితులు అలానే బంధు మిత్రులతో తమ అభిప్రాయాలను మరింత స్వేచ్ఛగా పెద్దగా పంపుకోవచ్చు. ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : 1G, 2G, 3G, 4G, 5G.. అసలేంటివి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే తన మొదటి ఫోటో ట్వీట్‌ను, జూలై 11, 2008న ట్విట్ పిక్ ద్వారా పంపించారు.

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ట్విట్టర్ అసలు పేరు ‘‘Twttr''

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 3,47,000 ట్వీట్లు పంపబడుతున్నాయి.

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ఓ స్టడీ ప్రకారం సిగరెట్స్, ఆల్కాహాల్ కంటే ట్విట్టర్ ఓ ప్రమాదకర వ్యసనమట.

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

చైనాలో 2009 నుంచి ట్విట్టర్‌ను బ్లాక్ చేసారు.

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ప్యాసెంజర్లతో ప్రయాణిస్తున్న యూఎస్ విమానం 1549 దురదృష్టవశాత్తూ హడ్సన్ నదిలో క్రాష్ - ల్యాండ్ అయ్యింది. ట్విట్టర్ యూజర్లు ఈ సమాచారాన్ని మీడియాకంటే 15 నిమిషాల ముందుగానే ప్రపంచానికి తెలియజేసారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి జానిస్ క్రుమ్స్ అనే వ్యక్తి ట్విట్ పిక్ లో పోస్ట్ చేసిన ఫోటో సంచలనంగా నిలిచింది.

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

ఒబామా దంపతుల ఆత్మీయ ఆలింగనం

ట్విట్టర్‌కు పదేళ్లు, ఆసక్తికర విషయాలు

2008, ఉగ్రవాద దాడులు ముంబై నగరాన్ని భయానకంగా మార్చేసాయి. ఈ దాడులను ప్రత్యక్షంగా తిలకించిన అనేక మంది తమ ట్విట్టర్ అకౌంట్‌లలో ఘటనా వివరాలను పోస్ట్ చేసారు. దాడులను నిరసిస్తూ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనను చిత్రీకరించి నిమీస్ ఆర్ ప్రకాష్ అనే యూజర్ ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot