మిస్ అయిన అబ్బాయిని 3గంటలలో తల్లి దండ్రుల వద్దకు చేర్చిన ట్విట్టర్

Posted By: Super

మిస్ అయిన అబ్బాయిని 3గంటలలో తల్లి దండ్రుల వద్దకు చేర్చిన ట్విట్టర్

ఇటీవల కాలంలో ప్రపంచంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో ఒక రకంగా అవి సాయం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఫేస్‌బుక్ ప్రాణాంతకమైన వ్యాధితో భాదపడుతున్నటువంటి ఓ తండ్రి బిడ్డకు ఫేస్‌బుక్ ద్వారా సహాయం అందించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు అదేబాటలో ట్విట్టర్ కూడా తప్పిపోయినటువంటి బాలుడిని మూడు గంటల్లో తన తల్లి దండ్రుల వద్దకు చేర్చి రుణం తీర్చుకుంది.

ఇక వివరాలలోకి వెళితే సౌది అరేబియాలోని దహరాన్ అనే ఊరిలో నివసిస్తున్నటువంటి పదహారు సంవత్సరాల వయసుకలిగినటువంటి ఫైసల్ ఫ్రై అనే యువకుడు తన తల్లి దండ్రుల వద్దనుండి మిస్ అవ్వడం జరిగింది. దాంతో అతని తల్లి దండ్రులు వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఫైసల్ ఫ్రై కి సంబంధించినటువంటి ఇమేజిని కూడా ట్విట్టర్‌లో పోందుపరచడం, ఫోన్ నెంబర్స్ లాంటివి అందుబాటులో ఉంచారు. దీంతో ఫైసల్ ఫ్రై మూడు గంటల తర్వాత తన తల్లి దండ్రుల వద్దకు చేరాడు.

ఇక్కడ ఇంకోక విషయం ఏమిటంటే మొట్టమొదట ఫైసల్ ఫ్రై తప్పిపోయాడని ట్వీట్ చేసినటువంటి మహామ్మద్ ఏఐ మోడయాన్ ట్వీట్ టాప్ ట్వీట్‌గా నిలచింది. ఇది మాత్రమే కాకుండా విషయం పూర్తిగా తెలుసకోవడానికి మహామ్మద్ ఏఐ మోడయాన్‌కి చాలా మంది రీట్వీట్స్ కూడా పంపించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఫైసల్ ఫ్రై ఫోటోని ట్విట్టర్‌లో ఉంచడం వల్ల అతనిని కనుక్కోవడం చాలా సులభంగా ఉందని అన్నారు. దీంతో ఫైసల్ ఫ్రై కుటుంబ సభ్యులు ఈ విషయంపై మహామ్మద్ ఏఐ మోడయాన్ అభినందించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot