Oppo నుంచి రెండు కొత్త Foldable స్మార్ట్ ఫోన్లు ! డిజైన్ లు లీక్ అయ్యాయి.

By Maheswara
|

ఈ రోజుల్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది, మరీ ఎక్కువగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ విభాగంలో అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఎక్కువ బ్రాండ్‌లు ఫోల్డబుల్ ఫోన్‌లను కొంచెం సరసమైన ధరతో తయారు చేస్తున్నందున ఇది త్వరలో మారే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం రెండు Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు అప్‌గ్రేడ్ చేసిన స్పెసిఫికేషన్ లతో ఈ సంవత్సరం లో లాంచ్ చేయబడతాయని నివేదికలు పేర్కొన్నాయి.

ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లు ఈ సంవత్సరం లాంచ్ అవుతాయి

ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లు ఈ సంవత్సరం లాంచ్ అవుతాయి

డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా వచ్చిన కొత్త లీక్ అయిన సమాచారం ప్రకారం Oppo నుండి రెండు ఫోల్డబుల్ ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి అని రిపోర్ట్ చెబుతోంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, Oppo Find N గత సంవత్సరం లాంచ్ చేయబడింది. మరియు ఒప్పో బ్రాండ్ నుండి ఇంత వరకు వచ్చిన  ఫోల్డబుల్ ఫోన్ ఇది మాత్రమే. శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్‌ కు పోటీగా తీసుకోవాలనే లక్ష్యంతో Oppo Find N బుక్-ఫోల్డ్ డిజైన్‌తో లాంచ్ చేయబడింది.

కొత్త లీక్

కొత్త లీక్

కొత్త లీక్ ప్రకారం ఇప్పుడు కొత్త Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు క్లామ్‌షెల్ డిజైన్ ఫోన్ మరియు మరొక బుక్-ఫోల్డ్ డిజైన్ రెండింటినీ కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. క్లామ్‌షెల్ డిజైన్ ఫోన్‌కి 'డ్రాగన్‌ఫ్లై' అనే సంకేతనామం ఉంది మరియు Samsung Galaxy Z Flip 3 మరియు Motorola Razr ఫోల్డబుల్ ఫోన్‌లను పోటీ గా తీసుకోవడం దీని లక్ష్యంగా తెలుస్తోంది. Oppo Find N యొక్క సక్సెసర్‌గా ఇతర బుక్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ వస్తుందని మనము ఆశించవచ్చు. రిపోర్ట్ ల ప్రకారం ఈ ఫోన్ Oppo Find N 2 గా లాంచ్ చేయబడుతుంది అని పేర్కొంది. అయితే ఇతర క్లామ్‌షెల్ ఫోన్ యొక్క అసలు పేరు తెలియదు.

Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు టీజ్ చేయబడ్డాయి: వీటి నుంచి ఏమి ఆశించాలి?
 

Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు టీజ్ చేయబడ్డాయి: వీటి నుంచి ఏమి ఆశించాలి?

ఎప్పటిలాగే, రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో మనము చాలా కొత్త అప్‌గ్రేడ్‌లను ఆశించవచ్చు. మొదటిది, రాబోయే Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు రెండూ బరువు మరియు మందం కోసం రీడిజైన్ చేయబడ్డాయి మరియు ఆప్టిమైజ్ చేయబడ్డాయి, ముఖ్యంగా బుక్-ఫోల్డ్ మోడల్ ఫోన్ ఎక్కువగా రీడిజైన్ చేయబడింది.

అదనంగా, రెండు Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో అంతర్గత డిస్‌ప్లేను తీసుకు వస్తుందని చెప్పబడింది. Oppo Find N 2 పెద్ద సెకండరీ డిస్‌ప్లేను కూడా పొందే అవకాశం ఉంది, ఇది క్లామ్‌షెల్ మోడల్‌లో చిన్నదిగా ఉంటుంది. రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌ల గురించి పెద్దగా తెలియదు.

Oppo ఫోల్డబుల్ ఫోన్‌ల లాంచ్ టైమ్‌లైన్ వివరాలు

Oppo ఫోల్డబుల్ ఫోన్‌ల లాంచ్ టైమ్‌లైన్ వివరాలు

Oppo ఫోల్డబుల్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ లేదా డైమెన్సిటీ ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయా అని నివేదికల అంచనాలున్నాయి. Oppo అధిక-పనితీరు గల ప్రాసెసర్‌ని కలిగి ఉంటుందని మరియు ఖరీదైన ధర ట్యాగ్‌తో దీనిని ప్రీమియం ఆఫర్‌గా మారుస్తుందని కూడా తెలుస్తోంది.

ప్రస్తుతం, ఫోల్డబుల్ ఫోన్‌లు ఇప్పటికీ ధర స్పెక్ట్రమ్‌లో ఖరీదైనవి గా ఉన్నాయి. నివేదికల ప్రకారం Samsung Galaxy A సిరీస్‌లో సరసమైన ఫోల్డబుల్ ఫోన్ లైనప్‌పై పని చేస్తోంది. Xiaomi మరియు OnePlus కూడా ఫోల్డబుల్ ఫోన్‌ల ను తీసుకురావాలని పనిచేస్తున్నాయి. ఇది రాబోయే Oppo ఫోల్డబుల్ ఫోన్‌ల కు పోటీని మరింత పెంచుతుంది.

శామ్సంగ్ 2025 నాటికి చౌకైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని Samsung నిర్ణయం.

శామ్సంగ్ 2025 నాటికి చౌకైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని Samsung నిర్ణయం.

తన నాల్గవ తరం ఫోల్డబుల్ ఫోన్‌లను-Galaxy Z Flip 4 మరియు Galaxy Z Fold 4-లను 2022 రెండవ భాగం లో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, వాటి ఖచ్చితమైన ప్రకటన మరియు ప్రారంభ తేదీలు ఇప్పటి వరకు తెలియలేదు. Tipster Jon Prosser ఫోన్‌ల ప్రకటన, ముందస్తు ఆర్డర్ మరియు సాధారణ లభ్యత కోసం సాధ్యమయ్యే తేదీలను వెల్లడించింది. Jon Prosser ప్రకారం, Samsung Galaxy Z Flip 4 మరియు Galaxy Z Fold 4ని ఆగస్టు 10, 2022న ఆవిష్కరిస్తుంది. కొన్ని మార్కెట్‌లలో అదే రోజున ఫోన్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయని నివేదించబడింది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఆగస్టు 26 నుండి సాధారణ లభ్యత ప్రారంభమవుతుంది. Galaxy Z Fold 4 లేత గోధుమరంగు, ఆకుపచ్చ మరియు ఫాంటమ్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటుంది. Galaxy Z Flip 4 బ్లూ, బోరా పర్పుల్, గ్రాఫైట్ మరియు పింక్ గోల్డ్ రంగులలో రావచ్చు.

తక్కువ ధరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ ధరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం తక్కువ ధరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది, ఇది సరసమైన విభాగంలోకి వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లక్ష కంటే ఎక్కువ ఖరీదు చేసే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లైనప్ కంటే చాలా తక్కువ ధరకే ఉంటుంది. ఈ ఫోన్ల అభివృద్ధికి సమయం పట్టవచ్చు, అయితే మేము పుకార్లను నమ్మగలిగితే  ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ 2025లో Galaxy A-సిరీస్ బ్రాండింగ్‌తో ప్రారంభించబడుతుంది అని అంచనాలున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ యొక్క ట్వీట్ Samsung Galaxy A-సిరీస్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి ఎదురుచూస్తోందని మరియు ఫోన్‌కు సరసమైన ధర ట్యాగ్ ఇవ్వబడుతుందని సూచిస్తుంది. అయినప్పటికీ, టిప్‌స్టర్ లాంచ్ టైమ్‌లైన్ మరియు డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లు వంటి ఇతర కీలక వివరాలను తెలుపలేదు.

సరసమైన ధర ట్యాగ్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

సరసమైన ధర ట్యాగ్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

Samsung యొక్క Galaxy A  సిరీస్ లైనప్‌ భారతదేశంలో రూ. 25,000 నుండి రూ. 45,000 మధ్య ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి, అయితే Galaxy Fold లైనప్ ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ. శామ్సంగ్ సరసమైన ధర ట్యాగ్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లయితే, అది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌లో లభించే అనేక ఫీచర్లను మినహాయించవలసి ఉంటుంది మరియు అదే జరిగితే, వినియోగదారులు కనీస తక్కువ స్పెసిఫికేషన్‌లతో ఫోల్డబుల్ ఫోన్‌ను పొందుతారు. 

Best Mobiles in India

English summary
Two New Oppo Foldable Phones Expected To Launch This Year. Designs Revealed.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X