సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌‌‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

|

సామ్‌సంగ్, తన గెలాక్సీ 'జే’ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గెలాక్సీ జే2 ప్రో (2018), గెలాక్సీ జే5 ప్రైమ్ (2017) మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ 'గీక్‌బెంచ్ లిస్టింగ్స్’ ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలను రివీల్ చేసింది.

 
సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌‌‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

గీక్‌బెంచ్ లిస్టింగ్స్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. గెలాక్సీ జే2 ప్రో (2018) స్మార్ట్‌ఫోన్ SM-J250F అనే మోడల్ నెంబర్‌తో వస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 1.4GHz క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

మరోవైపు గెలాక్సీ జే5 ప్రైమ్ (2017) స్మార్ట్‌ఫోన్ G571నే మోడల్ నెంబర్‌తో వస్తుంది. ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 4.8 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 7570 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ +...24గంటల్లో అవుట్ ఆఫ్ స్టాక్!ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ +...24గంటల్లో అవుట్ ఆఫ్ స్టాక్!

వీటితో పాటు గెలాక్సీ ఏ (2018) సిరీస్ ఫోన్‌లను కూడా సామ్‌సంగ్ రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్8కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న గెలాక్సీ ఎస్9 కూడా మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
One of the smartphones is believed to be the Samsung Galaxy J2 Pro (2018).

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X