Home
News

భూమి అంతమయితే ఈ రెండు గ్రహాల్లో నివాసం !

By Gizbot Bureau

ఈ భూమి ఎప్పటికైనా అంతమవుతుందని, మానవజాతి నశిస్తుందనే వార్తలు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సైంటిస్టులు కూడా దీనికి ఊతమిస్తూ కొత్త గ్రహాలలోకి వెళ్లాలని అందుకోసం రీసెర్చ్ చేస్తున్నామని కూడా చెబుతున్నారు.

Two Potentially Earth-Like Alien Planets Found Around Nearby Star

ఏదేమైనా భూమి అంతం అయితే మనుగడ ఎక్కడ అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే సమయంలో విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఎన్నో ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో గ్రహాంతర వాసులు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ వార్తల సంగతి ఎలా ఉన్నా.. లేటెస్ట్ గా శాస్త్రవేత్తలు భూమిని పోలిన రెండు గ్రహాలను గుర్తించారు.

 మరింత నివాసయోగ్యమైన గ్రహాలు

మరింత నివాసయోగ్యమైన గ్రహాలు

శాస్త్రవేత్తలు. ఎవరూ ఊహించనివిధంగా భూగ్రహం దగ్గర్లోనే భూమిపై కంటే మరింత నివాసయోగ్యమైన గ్రహాలు ఉన్నాయని అంటున్నారు. విశ్వం వెనక భాగంలో భూమి లాంటి రెండు గ్రహాలను రీసెర్చ్ టీమ్ గుర్తించింది.

టీ గార్డెన్స్ నక్షత్రం

టీ గార్డెన్స్ నక్షత్రం

అవి రాతి ఉపరితలాలపై నీరు ఏర్పడటానికి సరైన జోన్‌లో ఉన్నాయి. ఈ గ్రహాలు "టీ గార్డెన్స్ నక్షత్రం" అని పిలువబడే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇది భూమి నుంచి 12.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు లాగే కనిపిస్తున్నాయి అంటున్నారు. కాగా ఇవి చాలా భయంకరంగా కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు.

భూమి కంటే కొంచెం బరువుగా

భూమి కంటే కొంచెం బరువుగా

జర్మనీలోని గొట్టింగన్ యూనివర్శిటీ పరిధిలోని ఆస్ట్రోఫిజిక్స్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ సైంటిస్ట్ మాథియాస్ జెక్మైస్టర్ ఓ ప్రకటనలో ఈ విషయాలను తెలిపారు. ఈ రెండు గ్రహాలు మన సౌర వ్యవస్థ యొక్క అంతర్గత గ్రహాలను పోలి ఉన్నాయని తెలిపారుు. అవి భూమి కంటే కొంచెం బరువుగా ఉన్నాయని దానిపై నీరు ద్రవ రూపంలో ఉందని అంచనా వేస్తున్నారు.

నివాసయోగ్యమైన జోన్

నివాసయోగ్యమైన జోన్

ఈ రెండు గ్రహాలు నివాసయోగ్యమైన జోన్ అని పిలవబడే వాటిలో ఉన్నాయని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. భూమిపై కంటే కూడా ఈ గ్రహాలు నివాసానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. కాగా ఈ రెండు గ్రహాల మీదకు వెళ్లాలంటే చాలా కష్టమని కూడా చెబుతున్నారు. వీటి మీదకు ప్రయాణించాలంటే 12.5 కాంతి సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు.

 25 ఏళ్లలో అంగారక గ్రహంపై మానవ నివాసం

25 ఏళ్లలో అంగారక గ్రహంపై మానవ నివాసం

25 ఏళ్లలో అంగారక గ్రహంపై మానవ నివాసం సాధ్యమవుతుందని నాసా నమ్ముతోంది. భవిష్యత్తులో ఏ వ్యోమగామి అయినా అంగారక గ్రహంపై అడుగు పెట్టాలంటే ముందుగా ఎదురయ్యే అంతరిక్షం నుంచి ప్రాణాంతక అణుధార్మికత, దృష్టిని కోల్పోవడం, ఎముకలు కృశించడం తదితర ప్రమాదకరమైన సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని ఖగోళశాస్త్ర నిపుణులు, నాసా అధికారయంత్రాంగం చెబుతోంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం 25 ఏళ్లలో అంగారక గ్రహంపై మానవుడు అడుగు పెట్టడం సాధ్యమేనని నమ్మబలుకుతోంది.

Best Mobiles in India

English summary
Two Potentially Earth-Like Alien Planets Found Around Nearby Star
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X