భలే దొంగలు!

|

టైక్వాన్ సోలోమన్ (19), టెరాన్స్ సిస్‌ట్రక్ (16)లు ఐఫోన్ దొంగతనానికి పాల్పడిన కేసులో పోలీసులకు చిక్కారు. ఈ ఇద్దరి దొంగల ముఠా న్యూయార్క్ నగరంలో పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ఐఫోన్ దొంగిలించబడిదంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు కీలక ఆధారలతో దొంగలను పట్టుకోగలిగారు. దొంగిలించిన ఐఫోన్ ద్వారా ఆ ఇరువురు దొంగలు తమ ఫోటోలను చిత్రీకరించుకున్నారు. ఆ ఫోటోలు ఫోన్ యజమాని ఐక్లౌడ్ అకౌంట్‌లో నమోదయ్యాయి. ఈ ఫోటోలను ఆధారంగా చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

భలే దొంగలు!

పోయిన ఫోన్‌ను వెతికిపట్టుకునేందకు చిట్కాలు!

ఐఎమ్ఈఐ నెంబర్: ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ: ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించికుండా నివారించటమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యూప్ ఏర్పరుస్తుంది. ఈ యూప్‌లో పొందుపరిచిన యాంటీ-తెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది.

మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్: ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్‌లను చేధించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదురు మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది.

తీఫ్ ట్రాకర్: ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే తీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈ-మెయిల్‌కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X