త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

By Hazarath
|

మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిందా అన్నంతగా గత కొన్ని రోజులుగా సిరియాలో ఉగ్రవాదులకు రష్యాకు తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఉగ్రవాదులను ఎక్కడికక్కడే మట్టుబెడుతూ వస్తున్న రష్యాపై ఇప్పుడు ఎదురుదాడి చేసేందుకు ఉగ్రవాదులు కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఏకంగా రష్యాపై ఎదురుదాడికి దిగారు..రష్యా రాజధాని మాస్కోలో బాంబు పేలుడుకు కుట్ర పన్నారు. అయితే రష్యన్ పోలీసు బలగాలు ఈ దాడిని ముందుగానే గుర్తించి దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో ఒళ్లు మండిన రష్యా సిరియాలో ఉగ్రవాదులపై తాడోపేడో తేల్చుకోవాలని డిసైడైపోయింది. ఆ దిశగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. సరికొత్త ఆయుధాలతో సిరియాలో ఉగ్రవాద రక్తపుటేరులను పారిస్తోంది. మిగతాకథనం స్లైడర్‌లో..

Read more: రష్యా ‘ఉగ్ర'పంజా..మిస్సైల్స్‌తో ముప్పేట దాడి

వైమానిక బలగాలకు తోడు.. నేవల్ ఫ్లీట్‌ను కూడా సిరియాకు..

వైమానిక బలగాలకు తోడు.. నేవల్ ఫ్లీట్‌ను కూడా సిరియాకు..

వైమానిక దాడులతో ఐసిస్ తీవ్రవాదులపై విరుచుకు పడుతున్న రష్యా..సిరియా నుంచి తీవ్రవాదుల్ని తన్ని తరిమేస్తామని అంటోంది. రష్యా దాడులను ఐసిస్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. దీంతో వైమానిక బలగాలకు తోడు.. నేవల్ ఫ్లీట్‌ను కూడా సిరియాకు తరలిస్తోంది. కాస్పియన్ సముద్రం నుంచి ఈ ఫ్లీట్ మధ్యదరా సముద్రం గుండా సిరియా తీరానికి చేరుకుంటోంది. ఐసిస్‌కు పట్టున్న అలెప్పో,మోసూల్‌ మీద దాడి చేయడానికి నేవల్ ఫ్లీట్ అనువైనదే కాకుండా వ్యూహాత్మకంగా కీలకం అని భావిస్తున్నారు రష్యా సైన్యాధిపతులు...

నిబంధనలు ఉల్లంఘించి టర్కీ గగనతలంలోకి

నిబంధనలు ఉల్లంఘించి టర్కీ గగనతలంలోకి

ఇస్లామిక్ స్టేట్ స్థావరాల మీద మిస్సైల్ దాడులు చేయడానికి..మిడిల్ ఈస్ట్‌లో పాగా వేయడానికి ఇదే సరైన అవకాశమని రష్యా భావిస్తోంది. వైమానిక దాడులు చేసే సమయంలో రష్యా విమానం ఒకటి..నిబంధనలు ఉల్లంఘించి టర్కీ గగనతలంలోకి వెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నేవల్ ఫ్లీట్ మీద నుంచి అటాక్ చేయడం ఉత్తమమనే ఆలోచిస్తోంది రష్యన్ సైన్యం.

1722లో ఏర్పడిన కాస్పియన్ నేవల్ ఫ్లీట్

1722లో ఏర్పడిన కాస్పియన్ నేవల్ ఫ్లీట్

1722లో ఏర్పడిన కాస్పియన్ నేవల్ ఫ్లీట్...ఎక్కువగా చమురు నిక్షేపాల పరిశోధన, స్మగ్లింగ్ నిరోధంలో కృషి చేస్తోంది. కాస్పియన్ సముద్రంలోని నేవల్ ఫ్లీట్‌లో మిస్సైళ్లు, టొర్పెడోలు ఉన్న 20వార్ షిప్పులు ఉన్నాయి. సిరియాలో రష్యా వైమానిక దాడుల్ని వ్యతిరేకిస్తున్న అమెరికా, నాటో.. రష్యా కొత్త నిర్ణయంపై ఆచి తూచి స్పందించాలని నిర్ణయించాయి.

ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు..

ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు..

ఇక ఉగ్రవాదులు రష్యా రాజధాని మాస్కోలో సృష్టించతలపెట్టిన పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ముందుగానే స్పందించి భారీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. వెంటనే వేగంగా స్పందించి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టి కొందరు అనుమానితులను కూడా అరెస్టు చేశాయి.

సిరియా ప్రభుత్వ దళాలు కూడా రష్యా విమాన దాడుల ఆసరాతో ..

సిరియా ప్రభుత్వ దళాలు కూడా రష్యా విమాన దాడుల ఆసరాతో ..

సిరియా ప్రభుత్వ దళాలు కూడా రష్యా విమాన దాడుల ఆసరాతో తీవ్రవాదుల ఆధీనంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అనేక చోట్ల భీకరపోరు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హమా ప్రావిన్స్‌లోని కాఫర్ నబుడా అనే ప్రాంతాన్ని ప్రభుత్వ దళాలు స్వాధీనం చేసుకున్నాయని సిరియా ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఉత్తరాది లటాకియా ప్రావిన్స్‌లోనూ ప్రభుత్వ దళాలు తీవ్రవాద ప్రాంతాలను చేజిక్కించుకున్నాయని తెలిసింది. సిరియా తీవ్రవాద సంస్థల స్థావరాలపై సెప్టెంబర్ 30న రష్యా విమానదాడులు ప్రారంభించింది.

సిరియాలో మూడు వర్గాల మధ్య పోరాటం

సిరియాలో మూడు వర్గాల మధ్య పోరాటం

ఇప్పుడు సిరియాలో మూడు వర్గాల మధ్య పోరాటం జరుగుతుండడం విచిత్రమైన వ్యవహారం. ఇలా వైరుధ్య శక్తుల మధ్య ప్రముఖ సంఘర్షణ జరుగుతున్న మరో పశ్చిమాసియా దేశం యెమెన్. పర్షియా సింధుశాఖ దేశమైన యెమెన్ అఫ్గానీ తాలిబన్లకు విశృంఖల భూమి కావడం ఈ త్రిముఖ సమరానికి కారణం. యెమెన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన షియా ముస్లిం ఉద్యమకారులకు, ప్రభుత్వ దళాలకు మధ్య ఇటీవలి కాలంలో పోరు తీవ్రం అయింది. మూడవ వర్గం తాలిబన్లు.

అనేక ఏళ్లుగా ప్రజా విప్లవం

అనేక ఏళ్లుగా ప్రజా విప్లవం

అలాగే సిరియాలో బషీర్ అల్ అసాద్ నాయకత్వంలోని నియంతృత్వ వ్యవస్థను తొలగదోయడానికి అనేక ఏళ్లుగా ప్రజా విప్లవం సాగుతోంది. అరబ్ స్ప్రింగ్ పేరుతో వివిధ దేశాలలో మొదలైన ప్రజా విప్లవాలలో సిరియా తిరుగుబాటు కూడ భాగం. లిబియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలలో ప్రజా ఉద్యమాలు విజయవంతమయ్యాయి. కానీ సిరియాలో మాత్రం బషీర్ అల్ అసాద్ నిరంకుశ ప్రభుత్వం తిరుగుబాటుదార్లను దారుణంగా అణచివేయగలిగింది.

రష్యా, చైనా ప్రభుత్వాలు అసాద్‌కు అండగా..

రష్యా, చైనా ప్రభుత్వాలు అసాద్‌కు అండగా..

ఇందుకు ప్రధాన కారణం ఐరోపా అమెరికా ప్రభుత్వాలు అసాద్‌ను వ్యతిరేకించినప్పటికీ రష్యా, చైనా ప్రభుత్వాలు అసాద్‌కు అండగా నిలబడడం. ఫలితంగా తిరుగుబాటుదారులకు, అసాద్ దళాలకు మధ్య ద్విముఖ పోరాటం ఆరు సంవత్సరాలుగా నడుస్తోంది. ప్రజాస్వామ్యం గిట్టని చైనా కమ్యూనిస్టుప్రభుత్వం సిరియా నియంతను బలపరచవచ్చు. కానీ ప్రజాస్వామ్య రష్యా ప్రభుత్వం సిరియా నియంతను నిలబెట్టడానికి నియంత్రించడమే విచిత్రం...

ఆగ్రహజ్వాల మధ్య ప్రాబల్యపు పోరాటంగా..

ఆగ్రహజ్వాల మధ్య ప్రాబల్యపు పోరాటంగా..

ఇలా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆగ్రహజ్వాల మధ్య ప్రాబల్యపు పోరాటంగా పరిణమించడం ఆశ్చర్యకరం కాదు. అమెరికాకు ధీటుగా మరో ఆధిపత్యకేంద్రంగా అవతరించడానికి రష్యా యత్నిస్తుండడం దశాబ్దానికి పైగా నడుస్తున్న కథ.

 రష్యా చైనాల మద్దతుతో ..

రష్యా చైనాల మద్దతుతో ..

సిరియాలోని ప్రజావ్యతిరేక నియంతృత్వ వ్యవస్థను ప్రజాస్వామ్య రష్యా బలపరుస్తుండడం ఈ కథలోని ఇతివృత్తం. అరబ్ ఉప్పెన పేరుతో గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ఖండాలలోని ఇస్లాం మతరాజ్య వ్యవస్థలున్న దేశాలలో సంభవించిన ఉద్యమ విస్ఫోటనాలు అనేకమంది నియంతలకు పదవీచ్యుతిని కలిగించాయి. కానీ రష్యా చైనాల మద్దతుతో అసాద్ మాత్రం పదవిలో కొనసాగుతున్నాడు.

అసాద్ మరో ఏడేళ్లు పదవిలో కొనసాగడానికి..

అసాద్ మరో ఏడేళ్లు పదవిలో కొనసాగడానికి..

గత ఏడాది ప్రజాస్వామ్య ప్రక్రియను అభినయించగలిగాడు. అసాద్ మరో ఏడేళ్లు పదవిలో కొనసాగడానికి గత ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికలు వీలు కలిగించాయి. ఈ బూటకపు ప్రజాస్వామ్యాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించడం లేదు. కానీ రష్యా, చైనాలు మాత్రం హర్షించాయి. అసాద్ ప్రభుత్వం వారు మానవీయ జీవన మూల్యాలకు, అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు విరుద్ధంగా రసాయనిక ఆయుధాలను తయారుచేసి, విప్లవ దళాలపై ప్రయోగించడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

2013 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం

2013 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం

ఈ రసాయన మారణాస్త్రాలను స్వాధీనం చేసుకొని విధ్వంసం చేయడానికి వీలుగా అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ, 2013 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అసాద్‌ను వెనకేసుకొని వచ్చిన రష్యా, చైనా ప్రభుత్వాలు సైతం తీర్మానాన్ని బలపరచవలసి వచ్చింది.

గత ఏడాది ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ-ఐఎస్‌ఐఎస్- రంగ ప్రవేశం

గత ఏడాది ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ-ఐఎస్‌ఐఎస్- రంగ ప్రవేశం

ఇలా సిరియాలో జరుగుతున్న ద్విముఖ సమరం గత ఏడాది ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ-ఐఎస్‌ఐఎస్- రంగ ప్రవేశం చేయడంతో త్రిముఖ సంఘర్షణగా మారింది. అసాద్ ప్రభుత్వ దళాలు, అసాద్ ప్రభుత్వ వ్యతిరేక ప్రజావిప్లవ దళాలు, ఐఎస్‌ఐఎస్ బీభత్సకారులు-ఇలా మూడు వర్గాలు సిరియాలో ప్రాబల్యం కోసం యత్నిస్తుండడం వర్తమాన అంతర్యుద్ధ స్వరూపం...

ఐరోపా దేశాల నాయకత్వంలోని ‘పడమటి కూటమి'కి వ్యతిరేకంగా ..

ఐరోపా దేశాల నాయకత్వంలోని ‘పడమటి కూటమి'కి వ్యతిరేకంగా ..

అమెరికా, ఐరోపా దేశాల నాయకత్వంలోని ‘పడమటి కూటమి'కి వ్యతిరేకంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే వ్యూహంలో భాగంగానే రష్యా ప్రభుత్వం సిరియాలో ఐఎస్‌ఐఎస్ బీభత్స దళాలపై దాడులు ఆరంభించింది. తిరుగుబాటు దళాలకు మద్దతుగా పడమటి కూటమి దాడులు చేయకుండా ఐదేళ్లకు పైగా నిరోధించగలిగిన రష్యా, అసాద్ ప్రభుత్వాన్ని రక్షించింది.

ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది..

ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది..

ఇరాక్‌లో భయంకర బీభత్స రక్తపాతాన్ని సృష్టించగలిగిన ఐఎస్‌ఐఎస్ తరువాత, సిరియాలోకి చొరబడింది. ఇరాక్‌ను సిరియాను ఏకీకృతం చేసి ఒకే ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఐఎస్‌ఐఎస్ లక్ష్యం. సిరియా అని అంటే ఐఎస్‌ఐఎస్ దృష్టిలో దాదాపు రెండు లక్షల చదరపు కిలోమీటర్ల భూభానికి పరిమితమైపోయిన ప్రస్తుత సిరియా దేశం కాదట.

 పశ్చిమాసియాలోని వాయువ్య ప్రాంతమంతా ..

పశ్చిమాసియాలోని వాయువ్య ప్రాంతమంతా ..

ఇరాక్‌కు పడమరగా, సిరియాకు ఉత్తరంగా మధ్యధరా సముద్రం వరకు నల్ల సముద్రం వరకు విస్తరించిన పశ్చిమాసియాలోని వాయువ్య ప్రాంతమంతా తమ ఏకీకృత ఇరాక్ సిరియా మత సామ్రాజ్యంలో భాగం కావాలన్నది ఐఎస్‌ఐఎస్ జిహాదీ దుండగుల కల. జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయిల్, టర్కీ దేశాలను ఈ సామ్రాజ్యంలో కలిపివేయాలన్నది ఐఎస్‌ఐఎస్ వారి దుర్వాంఛ.

ప్రభుత్వ దళాల మధ్య, తిరుగుబాటు దళాల మధ్య, ఐఎస్‌ఐఎస్ దుండగుల మధ్య ..

ప్రభుత్వ దళాల మధ్య, తిరుగుబాటు దళాల మధ్య, ఐఎస్‌ఐఎస్ దుండగుల మధ్య ..

సిరియాలో చొరబడిన ఐఎస్‌ఐఎస్ హంతకులు దేశంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే సిరియా భూభాగాలు ప్రస్తుతం ప్రభుత్వ దళాల మధ్య, తిరుగుబాటు దళాల మధ్య, ఐఎస్‌ఐఎస్ దుండగుల మధ్య త్రిధా విభక్తమై ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించే వరకు..

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించే వరకు..

ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులపై పడమటి కూటమి వారు దాడులు చేయరాదని, రష్యా గతనెల వరకు వాదించడం విచిత్రమైన వ్యవహారం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించే వరకు ఐఎస్‌ఐఎస్ స్థావరాలను ఇతర దేశాలవారు ముట్టడించరాదన్నది రష్యా చెప్పిన మాట.

ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై సెప్టెంబర్ 30వ తేదీ నుంచి పెద్ద ఎత్తున దాడులను ..

ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై సెప్టెంబర్ 30వ తేదీ నుంచి పెద్ద ఎత్తున దాడులను ..

కానీ అసాద్ ప్రభుత్వాన్ని ఐఎస్‌ఐఎస్ కూల్చివేసే పరిస్థితి ఎదురుకావడంతో రష్యా ప్రభుత్వం సిరియాలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై సెప్టెంబర్ 30వ తేదీ నుంచి పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది. పడమటి కూటమి వారు టర్కీతో కలిసి ఇదివరకే ఐఎస్‌ఐఎస్‌పై యుద్ధం చేస్తున్నారు.

ఐరోపా దేశాలు తీవ్ర నిరసనలు..

ఐరోపా దేశాలు తీవ్ర నిరసనలు..

అందువల్ల రష్యా దాడును పడమటి కూటమి అంగీకరించింది కూడ.కానీ రష్యా ప్రభుత్వం తిరుగుబాటు దళాల స్థావరాల పై కూడా దాడులు మొదలు పెట్టడంతో ఐరోపా దేశాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తమ దళాలను సిరియాలో రష్యా సేనలతో తలపడడానికై సమాయత్తం చేస్తుండడం సరికొత్త పరిణామం.

మన ప్రభుత్వం ఐఎస్‌ఐఎస్‌ను వ్యతిరేకిస్తోంది

మన ప్రభుత్వం ఐఎస్‌ఐఎస్‌ను వ్యతిరేకిస్తోంది

మన ప్రభుత్వం ఐఎస్‌ఐఎస్‌ను వ్యతిరేకిస్తోంది. అసాద్ ప్రభుత్వం వారు తిరుగుబాటు దారులపై, వారిని సమర్థిస్తున్న ప్రజలపైన జరుపుతున్న దమనకాండను వ్యతిరేకిస్తోంది. అందువల్ల రష్యా, చైనాల సిరియా విధానాన్ని ఐఎస్‌ఐఎస్ విషయంలో మాత్రమే మన ప్రభుత్వం ఆమోదిస్తోంది. తిరుగుబాటుదారులపై దాడులను మన ప్రభుత్వం అంగీకరించజాలదు.

ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపైన మాత్రమే మేము దాడులు..

ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపైన మాత్రమే మేము దాడులు..

ఇదిలా ఉంటే నాటో దేశాలు ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగువేస్తున్నాయి. సిరియా సంక్షోభంలో రష్యా జోక్యంతో జర్మనీ నాటో సరిహహద్దుల్లో భద్రత పెంచేందుకు తమ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. నాటో సరిహద్దుల్లో భద్రతా బలగాలను అన్ని నాటో దేశాలు మొహరిచండానికి సిద్ధమైపోయాయి. అయితే రష్యా మాత్రం మా యుద్ధం సిరియాలోని ఉగ్రవాదులపైనే నని,ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపైన మాత్రమే మేము దాడులు చేస్తున్నామని చెప్పుకొస్తోంది.

45 టన్నుల మందుగుండు సామాగ్రిని సిరియాలోని రెబల్స్ కు ..

45 టన్నుల మందుగుండు సామాగ్రిని సిరియాలోని రెబల్స్ కు ..

ఇక రష్యా ప్రధాన శత్రువు అమెరికా సైతం రెబల్స్ తో చేయి కలపాలని చూస్తోంది. 45 టన్నుల మందుగుండు సామాగ్రిని సిరియాలోని రెబల్స్ కు అందించాలని అలాగే తమ సైన్యం పారాచ్యూట్ ద్వారా సిరియాలో దిగేలా సిద్ధం కావాలని యుఎస్ వ్యూహాలకు పదునుపెడుతోందని యుఎస్ ఇంటిలెజన్స్ వర్గాల సమాచారం. మరి ముందు ముందు ఈ వ్యవహారం ఇంకా ఎలా ముదురుతుందో చూడాలి.

 గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write U.S.-Made Weaponry Is Turning Syrian Conflict Into Proxy War With Russia

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X