కాబోయే భార్యకు వాట్సాప్ లో ఇడియట్ అని మెసేజ్ చేసినందుకు 4 లక్షలు ఫైన్
ఇడియట్ ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది రవి తేజ సినిమా. సినిమా పక్కన పెడితే నిజ జీవితంలో కూడా ఈ పదాన్ని చాలా మంది ఎదుటి వాళ్ళని తిట్టడానికి ఉపయోగిస్తుంటారు.
ఇడియట్ ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది రవి తేజ సినిమా. సినిమా పక్కన పెడితే నిజ జీవితంలో కూడా ఈ పదాన్ని చాలా మంది ఎదుటి వాళ్ళని తిట్టడానికి ఉపయోగిస్తుంటారు. ఈ తిట్టు మన దేశంలో పెద్ద బూతు కాకపోవచ్చు కానీ అరబ్ దేశాలలో ఇడియట్ అని తిడితే చాలా సీరియస్ గా తీసుకుంటారు. వారం రోజుల క్రితం అబుదాబి లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే...

అబుదాబికి చెందిన ఓ యువకుడికి కొద్దీ రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది...
అబుదాబికి చెందిన ఓ యువకుడికి కొద్దీ రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది అయితే అతను తనకు కాబోయే భార్యకు సరదాగా వాట్సాప్ లో "habla" (ఇడియట్ అని ఇంగ్లీష్ లో దాని అర్థం)అని మెసేజ్ చేశాడు. ఆ యువకుడు సరదాకి అలా మెసేజ్ చేసినప్పటికీ కాబోయే భార్య కి అది నచ్చలేదు . దీంతో కోపం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చివరకు ఆ కుర్రాడు 20,000 దీరామ్స్....
చివరకు ఆ కుర్రాడు 20,000 దీరామ్స్ (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4లక్షలు) ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఫైన్ తో పాటు తో పాటు 6నెలల జైలు శిక్ష కూడా విధించారు.

అరబ్ దేశాల్లో...
అరబ్ దేశాల్లో ఇలాంటి పదాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్ నేరంగా పరిగణిస్తారు.

కార్ డీలర్‌ని తిడుతూ మెసేజ్ చేశాడు....
ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న బ్రిటిష్ సిటిజన్ ఒకరు కార్ డీలర్‌ని తిడుతూ మెసేజ్ చేశాడు. దాంతో అతన్ని జైలులోకి వేశారు.


Click it and Unblock the Notifications








