ఆకాశంలో ఉబర్ ఆదాయం, అట్టడుగున డ్రైవర్ జీవితం
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ రవాణా రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ క్యాబ్ సేవల సంస్థ వచ్చిన అనతి కాలంలోనే అనేక విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో అపజయాలను అందుకుంది.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ రవాణా రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ క్యాబ్ సేవల సంస్థ వచ్చిన అనతి కాలంలోనే అనేక విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో అపజయాలను అందుకుంది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో ఉబర్ అనుకూల ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకుంది. డ్రైవర్లు మహిళా ప్రయాణికులను వేధిస్తున్నట్లుగా చాలామంది ఇప్పటికే కంప్లయింట్లు చేశారు.

అలాగే ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంధర్భాలు ఉన్నాయి.అలాగే డ్రైవర్ల మంచితనం చాలాచోట్లు చూశారు. ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఉబర్ డ్రైవర్ల పరిస్థతి అంత ఆశాజనకంగా లేవనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డ్రైవర్ల జీవితాలు
రవాణా రంగంలో సంచలనం నమోదు చేసిన ఉబర్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ల జీవితాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. నెలంతా కష్టపడినా కనీసం జీతంకు సరిపడా డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఊబెర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించిన వాళ్లు ఉన్నారని గర్వంగా చెప్పుకున్న వాళ్ల సైతం నేడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తే చాలనుకొని బతికే పరిస్థితి వస్తోంది.

అప్పులు చేసి
దేశంలో వందలాది మంది ఊబెర్ డ్రైవర్ల జీవితాలు దాదాపు ఇలాగే ఉన్నాయి. ఊబెర్ ఇండియాలో అడుగుపెట్టినప్పుడు ఇచ్చిన ఇన్సెంటీవ్స్ చూసి చాలామంది డ్రైవర్లుగా స్థిరపడ్డారు. అప్పులు చేసి మరీ ట్యాక్సీలు కొన్నారు. అప్పటి వరకు డ్రైవర్ ఫోన్ యాప్ ఆన్ చేసుకుంటే చాలు ఇన్సెంటీవ్స్ ఇచ్చిన ఊబెర్ డ్రైవర్ల సంఖ్య పెరగ్గానే వాటిని తగ్గించింది. 2017లో ఇన్సెంటీవ్స్ దారుణంగా పడిపోయాయి. చాలాకాలం క్రితమే ఐపీఓ ప్రణాళికలు మొదలుపెట్టిన ఊబెర్... అందుకోసం డ్రైవర్లకు ఇన్సెంటీవ్స్‌ని భారీగా తగ్గించేసింది.

ఊబెర్ ఐపీఓ
కంపెనీ ఆర్థిక పనితీరును పెంపొందించేందుకు డ్రైవర్ల ఇన్సెంటీవ్స్ తగ్గించడమే లక్ష్యం అనుకున్నాం. డ్రైవర్లలో అసంతృప్తి పెరుగుతుందని అంచనా వేశామని ఐపీఓ ఫైలింగ్‌లో ఊబెర్ వెల్లడించడం విశేషం. ఇదిలా ఇప్పుడు ఊబెర్ ఐపీఓ వచ్చేస్తోంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టింగ్ అయ్యేందుకు వ్యూహాలను సిద్దం చేసుకుంది.

ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని
అమెరికాలోని ఫివర్‌లెగ్ గర్ల్ విగ్రహానికి ఎదురుగా ఉన్న ఉబర్ కార్యాలయం రైడ్ హైరింగ్ సేవా రంగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఉబర్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నది. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్‌కి ఎదురుగా ఉబర్ కార్యాలయం ఉంది.

ఉబర్ వివాదం
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే తెలంగాణా రాష్ట్రంలో ఉబర్ వివాదంలో చిక్కుకుంది. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన ఛార్జీ సదరు ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా, డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా చూపిస్తుండటంతో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ నుంచి ఆటోనగర్‌కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన ప్రయాణానికి సంబంధించి రూ.344.30 ఛార్జ్ కనిపించింది. ఇదే సమయంలో డ్రైవర్ మొబైల్‌లో రూ.1120.18 డిస్‌ప్లే అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.

ఓలామనీ నుంచి నగదు చెల్లించేందుకు
ఉబర్ కస్టమర్ కేర్‌కు ప్రయాణికుడు ఫోన్ చేయగా ప్రయాణికుడి ఫోన్‌లో నమోదైన విధంగా చెల్లించాలని డ్రైవర్‌కు అతని మొబైల్‌లో చూపించిన విధంగా వసూలు చేయాలని రెండు రకాలుగా సమాధానం రావడంతో ఇద్దరు ఖంగుతిన్నారు. మరోవైపు ఓలామనీ నుంచి నగదు చెల్లించేందుకు చాలా మంది డ్రైవర్లు అంగీకరించడం లేదు. నగదు రూపంలో బిల్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓలామనీ నుంచి తమ అకౌంట్‌లోని నగదు బదిలీ కావడం లేదని.. దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని డ్రైవర్లు వాదిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఉబర్, ఓలా క్యాబ్ అగ్రిగేట్ సంస్ధలు మాత్రం సమస్యను పరిష్కరించడం లేదు.


Click it and Unblock the Notifications








