ఉబర్ హెలికాప్టర్ సర్వీసులు, ఛార్జీ ఎంతో తెలుసా ?

By Gizbot Bureau
|

ప్రస్తుత మార్కెట్లో ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు. ఏ రంగంలోనైనా పెరుగుతున్న పోటీకి తట్టుకుని నిలబడాలంటే తెలివినే పెట్టుబడిగా పెట్టాలి. విన్నూతంగా ఆలోచించాలి. మనుషుల ఆలోచనలకు తగ్గట్లుగా ముందుకెళ్లాలి. ఉబర్ టెక్నాలజీని సొమ్ము చేసుకుని ఇలాగే దూసుకెళ్తుంది.

 
uber helicopter service manhattan jfk uber copter

ఇప్పటికే ఉబర్ ట్యాక్సీ సర్వీస్ అందిస్తున్న ఈ సంస్థ లేటెస్ట్ గా ఉబర్ ఎయిర్ సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటి ద్వారా ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. తక్కువ ఛార్జీలతో హెలికాప్లర్లో వెళ్లవచ్చని ఉబెర్ చెబుతుంది. ఇప్పటివరకూ సొంత హెలికాప్టర్లలో లేదా ప్రైవేట్ హెలికాప్టర్లలో ఎక్కువ ఛార్జీలు చెల్లించి ప్రయాణించేవారు... ఇకపై తమ సర్వీసులలో తక్కువ ఛార్జీలకే వెళ్లవచ్చని ఉబెర్ ప్రకటించింది.

  ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే

ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే

ముందుగా... ఈ సర్వీసులను అమెరికా... న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచీ జాన్ ఎఫ్.కెనడి ఎయిర్‌పోర్ట్ వరకూ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికిప్పుడు ఈ సేవలు ఉబెర్ డైమండ్, ప్లాటినం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు

 ప్రతి 8 నిమిషాలకు రూ.15 వేలు

ప్రతి 8 నిమిషాలకు రూ.15 వేలు

ఈ సేవలకు వసూలు చేసే ధరలు వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్మాల్సిందే. ఉబెర్ మాత్రం ప్రస్తుతం ప్రైవేట్ జెట్స్‌కి చెల్లిస్తున్న రెంట్ల కంటే ఇది చాలా తక్కువే అవుతుందని చెబుతోంది.కంపెనీ ఈ సేవల కోసం ఆ కంపెనీ ప్రతి 8 నిమిషాలకు రూ.15 వేలు చొప్పున వసూలు చేయనుంది. త్వరలోనే ఈ సేవలను భారత్‌లో కూడా అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు చెప్పారు.ప్రస్తుతం ఉబెర్ కంపెనీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్డు మార్గంలో సేవలు అందిస్తోంది.

 ఒక హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణికులు
 

ఒక హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణికులు

ఈ సేవల కోసం న్యూజెర్సీకి చెందిన హెలీఫ్లైట్ అనే సంస్థతో ఉబెరి యాజమాన్యం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రోజుకు కేవలం 8 నుంచి 10 సర్వీసులను మాత్రమే నడుపనుంది. మాన్ హట్టన్ నుంచి కెన్నడీ ఎయిర్ పోర్టుకు ఈ హెలికాప్టర్ ద్వారా వెళ్తే పట్టే సమయం 8 నిమిషాలు. ఆ 8 నిమిషాల సమయానికే 15 వేల దాకా చార్జ్ చేస్తున్నారు. ఒక హెలికాప్టర్ లో ఐదుగురు ప్రయాణికులు వెళ్లొచ్చు.

సర్వీసులకు ఉన్న డిమాండ్ ను చూసి

సర్వీసులకు ఉన్న డిమాండ్ ను చూసి

కొన్ని రోజులు ఈ సర్వీసులకు ఉన్న డిమాండ్ ను చూసి.. తర్వాత యూఎస్ మొత్తం హెలికాప్టర్ టాక్సీలను విస్తరించాలని ఉబెర్ భావిస్తోంది. అలాగే.. ఇతర దేశాల్లోనూ ఈ టాక్సీలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇండియాలో కూడా ఎయిర్ టాక్సీలు వస్తాయా? అంటే ఉబెర్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు కానీ.. భారత్ లో కూడా ఉబెర్ టాక్సీలు ఉన్నాయి కాబట్టి... ఎయిర్ టాక్సీలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
UBER LAUNCHES HELICOPTER SERVICE BETWEEN NEW YORK’S MANHATTAN AND JFK AIRPORT

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X