ప్రయాణికులకు మరో శుభవార్తను మోసుకొచ్చిన ఉబర్
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ రవాణా రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ క్యాబ్ సేవల సంస్థ వచ్చిన అనతి కాలంలోనే అనేక విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో అపజయాలను అందుకుంది. ప
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ రవాణా రంగంలో అనేక సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ క్యాబ్ సేవల సంస్థ వచ్చిన అనతి కాలంలోనే అనేక విజయాలను నమోదు చేసింది. అదే సమయంలో అపజయాలను అందుకుంది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో ఉబర్ అనుకూల ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే వినియోగదారుల రక్షణకు మరింత పెద్దపీఠ వేస్తోంది. వారిని జాగ్రత్తగా గమ్యానికి చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉబర్ ఇప్పుడు Quiet-Mode పేరుతో సరికొత్త ఫీచర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

క్వైట్ మోడ్ ( Quiet Mode)
ఇకపై క్యాబ్‌లో ప్రయాణంలో డ్రైవర్‌తో సంభాషణ వద్దనుకునే వినియోగదారుల కోసం 'ఉబర్' సరికొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. క్వైట్ మోడ్ ( Quiet Mode)పేరుతో ఉబర్ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది ప్రస్తుతం Uber Black and Uber Black SUV premium rides సర్వీసులకు మాత్రమే అందుబాటులో ఉంది.

రెండు రకాల ఆప్సన్లు
యూజర్లు ఇప్పుడు ఉబర్ యాప్ లో మూడు రకాల ఆప్సన్లను ఎంపిక చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటి Quiet Preferred,కాగా రెండవది 'Happy to Chat' లేక No preference.ఈ ఆప్సన్ల ద్వారా ప్రయాణికులు ఉబర్ డ్రైవర్ తో తమ సంభాషణను కొనసాగించవచ్చు. ఇవి కాకుండా మెయల్స్ ద్వారా రిప్లయి ఇవ్వడం అలాగే మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయవచ్చు.

రైడ్ ప్రిపరెన్స్ లో ఉంటాయి
ఈ ఫీచర్లను ప్రయాణికులు రైడ్ ప్రిపెరన్స్ అనే ఆప్సన్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణంలో డ్రైవర్లతో ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రయాణికులు తమ లగేజి కోసం సాయాన్ని కూడా కోరవచ్చు.

అదనపు ఛార్జీ
ప్రయాణికుడు ఈ ఫీచర్‌ను వాడుకోవడానికి అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా డ్రైవర్ సంభాషణా నైపుణ్యాలకు ప్రయాణికులు రేటింగ్ ఇచ్చే వెసులుబాటు ప్రస్తుతం ఉబర్ యాప్‌లో ఉంది. ఈ విషయంలో మంచి స్కోరు తెచ్చుకోవాలనుకునే డ్రైవర్లు అవసరం లేకపోయినా ప్రయాణికులతో మాట కలిపేందుకు, సంభాషణ సాగించేందుకు ప్రయత్నిస్తుంటారు.

మిశ్రమ స్పందన
కాగా ఈ కొత్త ఆప్షన్‌పై వినియోగదారులు, డ్రైవర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రయాణికులు చాలా మంది దీనిని స్వాగతిస్తున్నారు. అదే సమయంలో, కొందరు దీనిని తప్పుబడుతున్నారు. ఇది డ్రైవర్ల పట్ల అగౌరవకరమైన చర్యని దీనిని వ్యతిరేకించేవారు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్విట్టర్లో స్పందన
ట్యాక్సీ డ్రైవర్‌తో మాట్లాడం ఇష్టం లేకపోతే ఆ విషయం సున్నితంగా నేరుగా చెప్పొచ్చని ట్విటర్‌లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ప్రయాణికులతో మాట్లాడేందుకు డ్రైవర్లు ప్రయత్నించడాన్నిగాని, వారు తమతో మాట్లాడొద్దని ప్రయాణికులు కోరుకోవడాన్నిగాని తప్పుబట్టలేమని మరొక యూజర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఇంగ్లండ్ వెళ్లే ఛాన్స్
త్వరలో క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఉబర్ ఓ అద్భుత అవకాశాన్ని ప్రయాణికులకు అందించింది. మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్, వేల్స్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులు ఉబర్ ద్వారా ఇంగ్లండ్ వెళ్లే ఛాన్స్ కొట్టేయవచ్చు. సింపుల్‌గా ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా చాలు. మీరు క్రికెట్ వరల్డ్ కప్‌కు వెళ్లే ఛాన్స్ కొట్టేయొచ్చు.

మే 13నుంచి ఈ ఆఫర్ స్టార్ట్
ఇందుకోసం మీరు ఉబర్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో మీరు స్కోర్ చేస్తే చాలు... మీకు వరల్డ్ కప్ చూసే ఛాన్స్ రావొచ్చు. మీరు ఉబర్ ఈట్స్, ఉబర్ రైడ్‌లో చేసే ప్రతీ ఆర్డర్‌పై మీకు రన్స్ వస్తాయి. ఎన్ని రన్స్ ఎక్కువగా ఉంటే వరల్డ్ కప్ చూసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... బహుమతులు కూడా ఉంటాయి. రవాణా సంస్థ ఉబర్ ఇప్పటికే ఈ కాంటెస్ట్‌పై విరాట్ కోహ్లీతో ప్రకటనలు ఇస్తోంది.


Click it and Unblock the Notifications








