వెడ్డింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్..

Written By:

మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులకు క్యాబ్ సేవలను అందిస్తున్న ఊబర్ ఇప్పుడు మరో కొత్త రకమైన సేవతో అందుబాటులోకి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పార్టీలు, విందులు, వినోదాలను జరిపే వారు తమ కార్యక్రమాల కోసం ఊబర్ కార్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వెడ్డింగ్స్ పేరిట కార్లను ఊబర్ ప్రవేశపెట్టింది. దీనిద్వారా మీరు పెళ్లిళ్లకు వచ్చే బంధువులకు ముందుగానే కార్లు బుక్ చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం.

ప్రమాదంలో పడేసే వాట్సప్ మెసేజ్‌లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎన్ని రైడ్లు కావాలో చెప్పి పేమెంట్ చేస్తే చాలు

ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ తమ కార్యక్రమాలకు అనుగుణంగా ఎంత మంది రానున్నారు ..? ఎందరు క్యాబ్లో వస్తారు ..? అన్న వివరాలను ఊబర్ సైట్లో పొందు పరిచి, ఎన్ని రైడ్లు కావాలో చెప్పి పేమెంట్ చేస్తే చాలు అందుకు అనుగుణంగా కార్లు వచ్చేస్తాయి.

పికప్

శుభకార్యాలకు వచ్చే అతిథులను అవి పికప్ చేసుకుని మళ్లీ వారిని మీరు ఎక్కడయితే డ్రాప్ చేయాలని బుక్ చేశారో అక్కడ డ్రాప్ చేస్తాయి.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పార్టీలు, డిన్నర్లు, పెళ్లిళ్లు

పార్టీలు, డిన్నర్లు, పెళ్లిళ్లు ... ఇలా వినియోగదారులు తమ కార్యక్రమానికి అనుగుణంగా పలు రకాల థీమ్స్తో కార్లను రైడ్స్ కోసం బుక్ చేసుకునే ఏర్పాటు కూడా కల్పించారు.

12 నగరాల్లో

ప్రస్తుతం ఊబర్ వెడ్డింగ్స్ హైదరాబాద్, బెంగుళూరు, కోల్కతా, న్యూ ఢిల్లీ, పూణె వంటి 12 నగరాల్లో లభ్యమవుతోంది. త్వరలో మరిన్ని నగరాలు, పట్టణాలకు ఈ సేవను విస్తరించనున్నట్టు ఊబర్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

థీమ్ బేస్డ్ కార్లు వద్దనుకుంటే

అయితే థీమ్ బేస్డ్ కార్లు వద్దనుకుంటే సదరు వినియోగదారులు పేమెంట్ చేసి పలు ప్రోమో కోడ్లను ముందుగానే పొందవచ్చని, వాటిని తమ అతిథులకు ఇవ్వవచ్చని, దీంతో వారు ఆ కోడ్లను వాడుకుని ఉచితంగా రైడ్ పొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

3 రోజుల ముందుగా

ఈ క్రమంలో వినియోగదారులు ఊబర్ వెడ్డింగ్స్ కార్లు కావాలనుకుంటే కనీసం 3 రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఊబర్ వెడ్డంగ్ కార్లు అందుబాటులోకి రాగలవు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Uber launches UberWeddings service in 12 Indian cities; here’s how it works read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot