రైడర్లకు Rs.5లక్షల ఇన్సూరెన్సును ఉచితంగా అందిస్తున్న ఉబెర్

|

ఉబర్ తన రైడర్లకు 5 లక్షల వరకు బీమా అందిస్తోంది అది కూడా పూర్తిగా ఉచితంగా. మీరు ఉబెర్ వాహనం ఎక్కిన వెంటనే మీకు ఆటోమ్యాటిక్ గా 5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది అని రైడ్-హెయిలింగ్ దిగ్గజం చెప్పారు. కాబట్టి ఉబెర్ లో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఉబెర్ రైడర్స్ గరిష్టంగా 5లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు.

భారతి ఆక్సా
 

ఈ భీమా పథకం కోసం కంపెనీ భారతి ఆక్సా, టాటా ఎఐజిలతో జతకట్టింది. ఈ బీమా కింద ఉబెర్ కార్లు, ఆటోలతో పాటు ఉబెర్ బైక్ రైడర్‌లను కూడా కవర్ చేస్తుంది. ఉబెర్ అన్ని మోడ్ల జర్నీలోని రైడర్స్ కోసం రైడర్ భీమాను ప్రారంభిస్తున్నది. రైడింగ్ లో ప్రాణాలు కోల్పోతే గరిష్టంగా 5లక్షలు, గాయాలకు 2లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

ఉబెర్ ట్రిప్

ఉబెర్ యొక్క కార్లు, ఆటోలు మరియు మోటో బైక్ లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ భీమా పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. అంటే మీరు రైడింగ్ కోసం ఏదైనా వాహనంను ఎంచుకున్న వెంటనే ఈ బీమా ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఎటువంటి రిజిస్టేయిన్ చేయవలసిన అవసరం లేదు. ఈ బీమా మీ ట్రిప్ పూర్తయ్యే వరకు కవరేజ్ చేయబడుతుంది అని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ (రైడ్స్) అధిపతి పవన్ వైష్ తెలిపారు.

గ్రేట్ న్యూస్: రియల్‌మి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

ట్రిప్ అండ్ ఫేర్ రివ్యూ

ఉబెర్ రైడర్ యాప్ ను మాత్రమే ఉపయోగించి కంపెనీకి ప్రమాదం గురించి నివేదించాలి. రైడర్స్ యాప్ లోని "గత ట్రిప్స్" విభాగాన్ని ఓపెన్ చేసి ఫీడ్ బ్యాక్ పంపాలి. నావిగేట్ చెయ్యడానికి వినియోగదారులు మెనుకి వెళ్లి "హెల్ప్" ఎంచుకుని ఆపై "ట్రిప్ అండ్ ఫేర్ రివ్యూ" కి వెళ్ళాలి. అప్పుడు మీరు "నేను ప్రమాదంలో చిక్కుకున్నాను" అని నివేదించవచ్చు. ఉబెర్ యొక్క 24 × 7 సహాయక బృందం రైడర్‌ వద్దకు చేరుకుంటుంది. తరువాత బీమాను క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి భీమా భాగస్వామితో సమన్వయం చేస్తుంది.

4 లక్షల బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ RS.599 ప్రీపెయిడ్ ప్లాన్

బీమాను క్లెయిమ్ చేయడానికి
 

మాములుగా బీమాను క్లెయిమ్ చేయడానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. కానీ ఇందులో సున్నితమైన అనుభవం కోసం మేము మొత్తం ప్రక్రియను క్యాష్-లెస్ గా చేసాము అని పవన్ తెలిపారు. దీనిని క్లెయిమ్ చేయడానికి రైడ్‌ను ఎంచుకోవాలి. తరువాత వివరాలతో కూడిన ఒక ఫారమ్‌ను నింపాలి. దీని తరువాత ఉబెర్ సహాయక బృందం సహాయం చేయడం కోసం మీతో సంప్రదిస్తుంది అని ఉబెర్ సీఈవో పవన్ తెలిపారు.

హెల్ప్‌లైన్‌

ఉబెర్ గత నెలలో తన వినియోగదారుల కోసం 24 × 7 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అత్యవసర సమస్య ఏదైనా ఉంటే వినియోగదారులు ఇప్పుడు ఉబెర్ యొక్క భద్రతా బృందంతో నేరుగా సంప్రదించవచ్చు అని కంపెనీ తెలిపింది. ఉబెర్ యాప్ లో భద్రతా టూల్‌కిట్‌లో భాగంగా ఇప్పటికే SOS బటన్‌ అదనంగా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Uber Offers Rs 5 Lakh Free Insurance to Uber Riders

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X