ఉబర్‌కి షాకిచ్చిన హ్యాకర్లు.. రూ. 65 కోట్లు చెల్లింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌ మరోసారి హ్యాకింగ్‌బారిన పడి విలవిలలాడింది.

By Hazarath
|

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌ మరోసారి హ్యాకింగ్‌బారిన పడి విలవిలలాడింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాహ్యాకింగ్‌ గురైనట్టు రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉబెర్‌ ప్రకటించింది. దీంతో పాటు హ్యాక్‌ అయిన సమాచారాన్ని తొలగించేందుకు హ్యాకర్లకు భారీ ఎత్తున దాదాపు రూ. 1,00,000 డాలర్లు ( సుమారు రూ.65కోట్లు) చెల్లించింది. ఈ వ్యవహారంలో ఉబెర్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ జో సుల్లివాన్, డిప్యూటీ అధికారి క్రైగ్ క్లార్క్‌లపై వేటువేసింది.

షియోమి రెడ్ మి నోట్ 5 ఫోన్ అసలు రూపం ఇదే !షియోమి రెడ్ మి నోట్ 5 ఫోన్ అసలు రూపం ఇదే !

57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను..

57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను..

గత ఏడాది అక్టోబర్‌లో హ్యాకర్లు ఉబర్‌కి చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను సంస్థ క్లౌడ్‌ సర్వర్‌ ద్వారా హ్యాక్ చేశారు. ఇందులో రైడర్ల పేర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్‌ల వివరాలు ఉన్నట్లు ఉబర్‌ పేర్కొంది. దొంగలించిన ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సీఈవో డారా అన్నారు

 2016 అక్టోబరులో ఉల్లంఘన..

2016 అక్టోబరులో ఉల్లంఘన..

ఈ హ్యాకింగ్ విషయాన్ని ఉబర్‌ సీఈవో డారా ఖోస్రోషాహి తన బ్లాగ్‌ పోస్ట్‌‌లో ధృవీకరించరారు. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకున్నామని, గతాన్ని తుడిచిపెట్ట లేం. కానీ పొరపాట్లనుంచి నేర్చుకుంటామనీ,ఇందుకు ప్రతి యుబెర్ ఉద్యోగి తరఫున హామీ ఇస్తున్నానని ఖోస్రోషాహి చెప్పారు

హ్యాకింగ్‌ గురించి కొన్ని రోజుల క్రితమే..
 

హ్యాకింగ్‌ గురించి కొన్ని రోజుల క్రితమే..

హ్యాకింగ్‌ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్‌ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్‌ కలోనిక్‌కు తెలిసిందట. అయితే సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2014 లో..

2014 లో..

కాగా 2014 లో గాడ్ వ్యూ అని పిలిచే ఒక సాఫ్ట్‌వేర్‌ ద్వారా గతంలో యుబెర్ డ్రైవర్ల, వినియోగదారుల సమాచారం హ్యాకింగ్‌కు గురైంది.

దొంగిలించిన సమాచారాన్ని డిలీట్‌ చేసేందుకు..

దొంగిలించిన సమాచారాన్ని డిలీట్‌ చేసేందుకు..

మరోవైపు దొంగిలించిన సమాచారాన్ని డిలీట్‌ చేసేందుకు ఆయా సం‍స్థలు భారీగా చెల్లింపులు చేస్తున్నాయని అమెరికాఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు, ప్రయివేట్‌ సెక్యూరిటీ అధికారులు వ్యాఖ్యానించారు.

Best Mobiles in India

English summary
Uber paid hackers to cover up massive data breach Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X