Home
News

ఉబెర్ నుంచి సరికొత్తగా దూసుకొస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

ట్రాన్స్ పోర్టు రంగంలో దూసుకుపోతున్న ఉబెర్ ఇప్పుడు టెక్నాలజీతో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఉబెర్ సెల్ప్ డ్రైవింగ్ కార్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

ట్రాన్స్ పోర్టు రంగంలో దూసుకుపోతున్న ఉబెర్ ఇప్పుడు టెక్నాలజీతో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఉబెర్ సెల్ప్ డ్రైవింగ్ కార్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గతంలోనే ఈ కార్లు ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ కొన్ని అనుకోని ఫలితాలు ఎదురవడంతో ఈ ప్రాజెక్ట్ కు అడ్డంకి ఏర్పడింది. క్యాబ్‌ అగ్రిగేటర్‌​ ఉబెర్‌కు చెందిన డ్రైవర్‌ లెస్‌​ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీపై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ ఉబెర్ ఇప్పుడు కొత్తగా ప్రయోగం చేస్తోంది.

మైల్ లూప్

మైల్ లూప్

డ్రైవర్‌ లెస్‌​ కార్లను సమూల మార్పులతో తీసుకువచ్చేందుకు Pennsylvania రాష్ట్రం నుంచి ఉబెర్ అప్రూవ్ కూడా పొందింది. ఇప్పుడు ఉబెర్ తన కంపెనీ ఆఫీసు ఉన్న Pittsburgh నుంచి 2016లో ఉబెర్ ఈ కార్లను ఆరంభించిన ప్రాంతాల మధ్య మైల్ లూప్ ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.

దాదాపు

దాదాపు

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను రోడ్లపై పరిగెత్తించే క్రమంలో విషాద సంఘటన ఒకటి కలకలం రేపింది. క్యాబ్‌ అగ్రిగేటర్‌​ ఉబెర్‌కు చెందిన డ్రైవర్‌ లెస్‌​ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అరిజోన రాష్ట్రంలోని టాంపెలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

9 నెలల తర్వాత

9 నెలల తర్వాత

ఉబెర్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు టెస్టింగ్‌ ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన జరిగిన 9 నెలల తర్వాత ఉబెర్ మళ్లీ రోడ్ల మీదకు సమూల మార్పులతో ఈ డ్రైవర్‌ లెస్‌​ కారును తీసుకొస్తోంది. పబ్లిక్ రోడ్ల మీద హై స్పీడు అలాగే చీకటిలో కారును ఎలా డ్రైవ్ చేయాలి అనే అంశాల మీద ఇప్పుడు ప్రయోగాలు చేస్తోంది.

 

 

గంటకు 25 మైళ్ల వేగం

గంటకు 25 మైళ్ల వేగం

వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో అలాగే చీకటి పడినప్పుడు వేగం ఎంతవరకు ఉండాలి. ఏ వేగంతో కారు ముందుకెళ్లాలి అనే అంశాల మీద కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. గంటకు 25 మైళ్ల వేగంతో వెళ్లే విధంగా ఇవి ముందుకు రానున్నట్లు సమాచారం.

వోల్వోతో ఒప్పొందం

వోల్వోతో ఒప్పొందం

ఉబెర్ ఈ కార్ల కోసం దిగ్గజ ఆలోమొబైల్ సంస్థ వొల్వోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వోల్వో 24 వేల కార్లను అందించనుంది. కాగా ఈ మధ్య టయోటా కూడా 500 మిలియన్ డాలర్లను ఉబెర్ లో ఈ కార్ల అభివృద్ధి కోసం పెట్టుబడిగా పెట్టింది.

 

 

ప్రమాద దృశ్యాలు బయటకు

ప్రమాద దృశ్యాలు బయటకు

కాగా ఇంతకుముందు అరిజోనా రాష్ట్రంలోని టెంపె ప్రాంతంలో జరిగిన ప్రమాద సమయంలో వోల్వో వాహనంలోని కెమెరాల ద్వారా లోపల, బయట జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. చీకట్లో ఎలైనే హెర్జ్‌బర్గ్‌(49) తన సైకిల్‌తో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో లోపల కూర్చున్న వాహనదారు కూడా ఊహించని ఆ పరిణామంతో షాక్‌ తినటం చివర్లో చూడొచ్చు.

 

 

కారులోని వ్యవస్థ

కారులోని వ్యవస్థ

క్యాబ్‌ అగ్రిగేటర్‌​ ఉబెర్‌కు చెందిన డ్రైవర్‌ లెస్‌​కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెర్జ్‌బర్గ్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. కారులోని వ్యవస్థ పాదాచారిని గుర్తించకపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో ఈ తరహా వాహనాల పరీక్షను నిలిపివేస్తున్నట్టు ఉబెర్‌ అప్పుడు ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Uber plans smaller, more cautious self-driving car launch More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X