గూగుల్ పే ద్వారా రూ.1000 గిఫ్ట్ కార్డు, ఉబెర్ కొత్త ప్రయోగం
యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. భారత్‌లోని క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ వినియోగదారులకు శుభవార్త.
యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. భారత్‌లోని క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఉబెర్ క్యాబ్, ఆటో, మోటో రైడర్లు.. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ మొబైల్ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే'(తేజ్) ద్వారా నగదు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపాయి. రైడర్లు ఇక నుంచి ఉబెర్ యాప్‌లో గూగుల్ పేను తమ పేమెంట్ ఆప్షన్‌గా వినియోగదారులు ఎంచుకునే వీలుంది. దీని కోసం యూజర్లు తమ యాప్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌లో ప్రతి నెలా ఈ యాప్‌ను దాదాపు 2.2కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పేమెంట్..
ఇప్పటివరకు డైరెక్ట్‌గా క్యాష్ చెల్లింపు సదుపాయంతో పాటు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, జియో మనీ, గిఫ్ట్ కార్డుల ద్వారా ఉబెర్ రైడర్లు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

గూగుల్ పే' నగదు ప్రోత్సాహకాలు ..
కస్టమర్లను ఆకట్టుకోవడానికి 'గూగుల్ పే' నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. వినియోగదారులు చెల్లించే ప్రతి బిల్లుకు ఒక స్క్రాచ్ కార్డు లభిస్తుంది.

రూ.1000 వరకు నగదు..
దీన్ని స్క్రాచ్ చేస్తే రూ.1000 వరకు నగదును గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

ఉబెర్‌కు అమెరికాలో భారీ షాక్..
ఇదిలా ఉంటే ఉబెర్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. 2016 నాటి డేటా బ్రీచ్ ఆరోపణలకు సంబంధించి సంస్థకు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంది.

కస్టమర్ల డేటా చోరీ
ఉబెర్ డ్రైవర్లు, కస్టమర్ల డేటాను చోరీ చేసిన కేసులో ఊబెర్ సంస్థకు ఈ పెనాల్టీ పడింది. ఇది అతి పెద్ద బహుళ డేటా ఉల్లంఘన పరిష్కారమని న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బారా వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా..
2016 లో హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల ( 5.7 కోట్లు) వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం ద్వారా రైడ్-షేర్ కంపెనీ డేలా చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

25.6 మిలియన్ల అమెరికన్ యూజర్లు..
వీరిలో 25.6 మిలియన్ల అమెరికన్ యూజర్లు ఉన్నారు. 6లక్షలమంది డ్రైవర్ లైసెన్స్ నంబర్లతో సహా, 10లక్షలకు పైగా ఉబెర్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్స్ చోరీకి గురయ్యాయి.

అమెరికా రాష్ట్రాలకు భారీ మూల్యం..
కాలిఫోర్నియా కోర్టులో సాగిన ఈ కేసులో అమెరికా రాష్ట్రాలకు భారీ మూల్యం చెల్లించనున్నట్లు ఉబర్ అంగీకరించింది. అమెరికాలోని

సుమారు 148 మిలియన్ల డాలర్లు..
50 రాష్ర్టాలతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాకు సుమారు 148 మిలియన్ల డాలర్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఆ రాష్ట్రాల మధ్య పంపిణీ అవుతుంది.

ఇకపై తమ కస్టమర్ల డాటాను ..
మరోవైపు ఊబెర్ కొత్త చీఫ్ కొష్రోవ్‌షాహి నవంబర్ లో ఉల్లంఘనను అంగీకరించారు. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై తమ కస్టమర్ల డాటాను సురక్షితంగా, భద్రగా ఉంచుతామని ఉబెర్ హామీ ఇచ్చింది.

ఆయా ప్రభుత్వాలతో ..
ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలతో నిర్మాణాత్మక , సహకార సంబంధాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. డేటా ప్రైవసీ నియంత్రణపై ఒక మానిటర్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపింది.

ఇప్పటికీ రైడర్స్, డ్రైవర్ల డేటా..
కాగా ఇప్పటికీ రైడర్స్, డ్రైవర్ల డేటా ఉల్లంఘనపై చికాగో, లాస్ ఏంజిల్స్ నగరాల నుంచి ఉబెర్ వ్యాజ్యాలని ఎదుర్కొంటోంది. డేటా ఉల్లంఘనపై ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిన సంస్థఅప్పటి చీఫ్ ప్రైవసీ అధికారిపై వేటు వేసింది.

జులైలో ఇద్దరు ఆఫీసర్లను..
అలాగే గత జులైలో ఇద్దరు ఆఫీసర్లను నియమించుకుంది. రుబీజెఫోను ప్రధాన గోప్యతా అధికారిగాను, మట్ ఓల్స్‌ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌నుగాను నియమించింది.


Click it and Unblock the Notifications