ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుగులో పూర్తి సమాచారం

ఈ విడుదలలో ఒక కొత్తరకం అంతర్వర్తి పరిచయం అవుతుండగా, తెలుగు తోడ్పాటు ప్రారంభం నుండి (డివిడి ప్రవేశపెట్టి బూట్ చేయడం నుండి) ముగింపు వరకు వుండటం ప్రథమం. బహుశా డిబియన్ మరియు డెబియన్ ఆధారిత పంపకాలను తప్పించి మిగతా లినక్స్ పంపకాలలో లేదనుకుంటాను. ఇక ఇప్పుడు ఇంగ్లీషు అంతగా రాని పిల్లలు, పెద్దలు, అందరూ దర్జాగా కంప్యూటర్ వాడవచ్చు. తెలుగుతో పాటు కన్నడం కూడా తోడ్పాటు లభించటంతో ఇప్పుడు భారతదేశ భాషలలో పది భాషలలో అందుబాటులోకి వచ్చింది.
ఉబుంటు విడుదలలో బహుళ స్పర్శ సాంకేతిక సౌలభ్యం వుంది. అంటే మౌస్ తో వాడుకోవటం పాతబడే రోజులు దగ్గరయ్యాయి. చేతి వేళ్లతో రకరకాల పనులు చేయవచ్చు. దీనికి కావలసిన ట్రాక్ పాడ్ కొత్తగా వచ్చే లాప్టాప్, నెట్బుక్, టాబ్లెట్ లలో లభ్యమవుతుంది. బ్లూటూత్ సౌకర్యం వున్న లాప్టాప్ వాడుకరులు యాపిల్ ట్రాక్ పాడ్ కొనుక్కొని ఈ కొత్త సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
దాదాపు పది ఏళ్ల నుండి తెలుగు స్థానికీకరణం గురించి జరుగుతున్న కృషికి ఇదొక మైలు రాయు. 2005 లో తెలుగు తోడ్పాటు మొదలైనా, ఫైర్ఫాక్స్, నాణ్యత గల తెలుగు కార్యాలయ సాఫ్ట్వేర్ (లిబ్రెఆఫీస్) లభ్యం కావటానికి ఇంత సమయం పట్టింది. మీరు ఇప్పటికే విండోస్ వాడుతున్నా, దీనిని రెండవ నిర్వహణ వ్యవస్థగా లేక దానిపై అనువర్తనంలాగా వాడటానికి అవకాశముంది. దీనిని గురించి తెలుగులో screenshots తో సులభంగా అర్థమయ్యే రీతిలో ఎలెక్ట్రానిక్ పుస్తకం తయారు చేసి అందుబాటులోకి తేవడమైనది.


Click it and Unblock the Notifications








