ఉత్తరప్రదేశ్‌లో గ్రహాంతరవాసుల కలకలం?

|

గ్రహాంతర వాసులదిగా భావిస్తోన్న అన్ ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ) ఇమేజ్ ఒకటి ఉత్తరప్రదేశ్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం రేపుతోంది. ఈ వైరల్ ఫోటోను చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లో గ్రహాంతరవాసుల కలకలం?

pradesh18.com చెబుతోన్న వివరాల ప్రకారం ఈ అన్ ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌ను మొబైల్ ఫోన్ ద్వారా కాస్‌గంజ్ జిల్లా మణిపూర్ ప్రాంతంలో చిత్రీకరించిట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చిత్రీకరించిన వ్యక్తి మొబైల్ ఫోన్ మాత్రం స్విచ్‌ఆఫ్‌లో ఉంది. తమకు అందిన ఈ ఫోటోను విచారణ నిమిత్తం MeT డిపార్ట్‌మెంట్‌కు పంపినట్లు జిల్లా అధికారి విజేంద్ర పాండియన్ తెలిపారు.

Read More : రింగింగ్ బెల్స్ నుంచి రూ.251 ఫోన్, రూ.9,900 టీవీ (వచ్చేసాయ్)

భారత్‌ - చైనా సరిహద్దుల్లో

భారత్‌ - చైనా సరిహద్దుల్లో

గత రెండేళ్లనుంచి భారత్‌ - చైనా సరిహద్దులోని హిమాలయ పర్వత శ్రేణుల్లో.. సరిహద్దు సైనికులు యూఎఫ్‌వోలను చూశామని చెబుతున్నారు. నిజంగా గ్రహాంతర వాసులు తమ స్థావరాలను హిమాలయ శిఖరాల్లో ఏర్పాటు చేసుకున్నాయా? గ్రహాంతర వాసుల జాడ వేరే గ్రహాల మీద వెతుకుతున్న మనం.. ఈ భూమి మీద కనిపిస్తున్న వాడి జాడలను మాత్రం పట్టించుకోవడం లేదు.

అసలు అవి ఎక్కడున్నాయో తెలిస్తే

అసలు అవి ఎక్కడున్నాయో తెలిస్తే

అసలు అవి ఎక్కడున్నాయో తెలిస్తే ఓ పరిశోధన అంటూ చేయొచ్చంటున్నారు పరిశోధకులు. వారికోసమే అన్నట్లుగా గ్రహాంతర వాసుల అడ్రస్‌ దొరికింది. ఇండియా - చైనా సరిహద్దులో యూఎఫ్‌వోలు కనిపించాయన్నది వాస్తవం. సాక్షాత్తూ బోర్డర్‌లోని సైనికులే వీటిని చూశారు. స్కైరాకెట్‌ ప్రయోగించడాన్ని తాము స్పష్టంగా చూశామని సైనికులు చెబుతున్నారు.

పసుపు రంగులో వింత గోళాకారంలో
 

పసుపు రంగులో వింత గోళాకారంలో

పసుపు రంగులో వింత గోళాకారంలో ఉన్నాయని అంటున్నారు. స్కై రాకెట్‌ను మోసుకుపోతున్నట్టుగా ఉన్న వళయాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి చైనా వైపు ప్రయాణించాయని చూసిన వారు చెబుతున్నారు.

గ్రహాంతర వాసులు ప్రయాణించే కొన్ని వాహనాలు

గ్రహాంతర వాసులు ప్రయాణించే కొన్ని వాహనాలు

చైనా సరిహద్దుల్లో కొన్ని గ్రహాంతర వాసులు ప్రయాణించే కొన్ని వాహనాలను చూశామని చెబుతున్న వారు కోకొల్లలు. గత ఆగస్టు నుంచి కనీసం వంద యూఎఫ్‌వోలను చూశామని చెబుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌కు పంపించామని చెప్పారు సైనికులు.

చైనా పంపించిన ఓ నిఘా వ్యవస్థ..?

చైనా పంపించిన ఓ నిఘా వ్యవస్థ..?

అయితే ఇటీవల చైనా ఓ సెక్యూరిటీ డ్రోన్‌ ను తయారు చేసింది. బహుశా అదే అయి వుండొచ్చని, లేకపోతే చైనా పంపించిన ఓ నిఘా వ్యవస్థ అయి వుండొచ్చని ఓ ఆర్మీ అఫీషియల్‌ అంటున్నారు. అయితే డ్రోన్‌ గాని, చైనా పంపించిన శాటిలైట్‌లు అయ్యే అవకాశం లేదని స్వయంగా ఆర్మీ అధికారులే చెబుతున్నారు.

గత మూడు నెలలుగా

గత మూడు నెలలుగా

గత మూడు నెలలుగా ఈ వింత వస్తువులు కనిపిస్తుండడంతో అవేంటో కనిపెట్టడానికి రాడార్లను ప్రయోగించారు. కానీ అవేంటో కనిపెట్టలేకపోయారు. నాన్‌ మెటలిక్‌తో తయారు చేసిన వాహనాలు కావటం వల్లే రాడార్‌లు గుర్తించలేకపోయాయని చెబుతున్నారు.

 వింత వస్తువులు కనిపించడం ఇప్పుడేం కొత్తకాదు

వింత వస్తువులు కనిపించడం ఇప్పుడేం కొత్తకాదు

భారత్‌ - చైనా సరిహద్దుల్లో ఇటువంటి వింత వస్తువులు కనిపించడం ఇప్పుడేం కొత్తకాదు. ఐదారేళ్ల క్రితం కూడా ఇటువంటివి కనిపించాయని హయ్యార్‌ అఫీషియల్స్‌కు వీటికి సంబంధించిన వివరాలు చెప్పినా పట్టించుకోలేదని ఆర్మీ సైనికులు చెబుతున్నారు. పర్వతారోహకులు కూడా 2004లోనే వీటిని చూసినట్లు రిపోర్టులు ఉన్నాయి.

లగన్ ఖేల్ ప్రాంతంలో వీటిని చూసినట్లు

లగన్ ఖేల్ ప్రాంతంలో వీటిని చూసినట్లు

లగన్ ఖేల్ ప్రాంతంలో వీటిని చూసినట్లు సైన్యం పై అధికారులకు నివేదిక పంపింది. గత కొన్ని నెలల్లో దాదాపు వంద సార్లు యూఎఫ్ఓలు కన్పించాయని, అయితే చాలా కాలం తర్వాత మళ్లీ కన్పించాయని సైన్యం పేర్కొంటోంది.

పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు

పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు

వీటి విషయమై పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ అప్పటి రక్షణ మంత్రి ఆంటోనీ యూఎఫ్ఓల గురించి కచ్చితమైన ఆధారాలేమీ లభ్యంకాలేదన్నారు.

పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని

పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని

శాస్త్ర పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని, లడఖ్ లాంటి ఎత్త్తెన ప్రాంతం నుంచి బాగా కన్పిస్తాయని వాటిని చూసే సైన్యానికి చెందిన సిబ్బంది యూఎఫ్ఓలుగా భ్రమిస్తోందని అంటున్నారు...

పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని

పరిశోధకులు మాత్రం ఇవి గురు, శుక్ర గ్రహాలని

అయితే, వీటిని గ్రహాలుగా అంగీకరించేందుకు సైన్యం ససేమిరా అంటున్నట్టు తెలుస్తొంది. గురు, శుక్ర గ్రహాల గురించి తమకు తెలుసునని, వాటిని రోజూ స్పష్టంగా చూస్తూనే వుంటామని, వాటిని చూసి యూఎఫ్ఓలని ఎలా భ్రమిస్తామని ఓ సైన్యాధికారి ప్రశ్నించారు.

ఎగురుతున్న పళ్లాల వంటి వాటిని

ఎగురుతున్న పళ్లాల వంటి వాటిని

కాగా, 2012లోనే కార్గిల్-లెహ్, చైనా సరిహద్దులను పర్యవేక్షించే '14 కార్ప్స్' మిలటరీ విభాగం నుంచి ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు అందిన సమాచారం ప్రకారం ఇండో టిబెటన్ బార్డర్ దళాలు ఎగురుతున్న పళ్లాల వంటి వాటిని చూశారని, పెన్గాంగ్సో సరస్సు సమీపంలో ఇవి కనిపించాయని వెల్లడించింది.

Best Mobiles in India

English summary
'UFO' sighted in Uttar Pradesh's Kasganj, image goes viral. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X