రూ.2500తో ఆధార్ సాఫ్ట్‌వేర్‌ హ్యాకింగ్, హుఫ్‌పోస్ట్‌ సంచలనం

ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే.

|

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి ఆధార్ భద్రతపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆధార్ హ్యకింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆధార్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచీ.. దాని డేటా సెక్యురిటీ ఓ హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. ఆధార్‌ నెట్‌వర్క్‌ సురక్షితంగా కాదంటూ ఇప్పటికే పలు రిపోర్టులు తేల్చాయి. ఇప్పుడు మళ్లీ దాని భద్రతపై కొత్త ప్రశ్నలు వచ్చాయి.

భారీ నష్టాల్లో పేటీఎమ్, ఎంతలా అంటే..?భారీ నష్టాల్లో పేటీఎమ్, ఎంతలా అంటే..?

సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌ ద్వారా ..

సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌ ద్వారా ..

సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌ ద్వారా కొత్త ఆధార్‌ యూజర్లు ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లోని క్లిష్టమైన భద్రతా ఫీచర్లను డిసేబుల్‌ చేమొచ్చని హుఫ్‌పోస్ట్‌ ఇండియా బహిర్గతం చేసింది.

మూడు నెలల పాటు..

మూడు నెలల పాటు..

మూడు నెలల పాటు జరిగిన ఓ ఇన్వెస్టిగేషన్‌లో ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ హ్యాక్‌ చేయొచ్చని వెల్లడైంది.

మూడు విభిన్న ప్రదేశాల నుంచి..

మూడు విభిన్న ప్రదేశాల నుంచి..

మూడు విభిన్న ప్రదేశాల నుంచి గ్లోబల్‌ సెక్యురిటీ నిపుణుల ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయించినట్టు హుఫ్‌పోస్టు ఇండియా వెల్లడించింది. ఈ ముగ్గురు కూడా హ్యాక్‌ను ధృవీకరించినట్టు తెలిపింది.

రూ.2500కే ..

రూ.2500కే ..

ఈ ప్యాచ్‌ కేవలం రూ.2500కే లభ్యమవుతుందని, అనధికారిక వ్యక్తులు ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌ చేసేలా ఇది అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది.

ఆధార్‌ నెంబర్లను జనరేట్‌ చేసేలా..

ఆధార్‌ నెంబర్లను జనరేట్‌ చేసేలా..

ప్రపంచంలో ఏమూల నుంచైనా.. ఆధార్‌ నెంబర్లను జనరేట్‌ చేసేలా వారికి అనుమతి ఇస్తుందని రిపోర్టు తెలిపింది. దీన్ని విస్తృతంగా వాడుతున్నట్టు కూడా పేర్కొంది.

ఇన్‌-బిల్ట్‌ జీపీఎస్‌ సెక్యురిటీ ఫీచర్‌..

ఇన్‌-బిల్ట్‌ జీపీఎస్‌ సెక్యురిటీ ఫీచర్‌..

ప్యాచ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌-బిల్ట్‌ జీపీఎస్‌ సెక్యురిటీ ఫీచర్‌ను డిసేబుల్‌ చేస్తుందని రిపోర్టు వెల్లడించింది.

యూజర్లను ఎన్‌రోల్‌ చేయడానికి ..

యూజర్లను ఎన్‌రోల్‌ చేయడానికి ..

యూజర్లను ఎన్‌రోల్‌ చేయడానికి ప్రపంచంలోనే ఏ మూల నుంచైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడేలా అనధికారిక వ్యక్తులకు అనుమతిస్తుందని పేర్కొంది.

యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)

యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)

ఈ రిపోర్టులను యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) కొట్టిపారేస్తూ వస్తోంది. వందల వేల సార్లు ప్రయత్నించినా ఆధార్‌ డేటాను బ్రేక్‌ చేయలేరని యూఐడీఏఐ చెబుతూ వస్తోంది.

Best Mobiles in India

English summary
UIDAI Aadhaar software used to enrol new users may have been subjected to a hack using a software patch that disables critical security features more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X