వీటికి ఆధార్ అవసరం లేదు, ప్రధాన రంగాలకు షాకిచ్చిన uidai

|

టెలికాం కంపెనీలు ఆధార్‌ను ఎట్టి పరిసస్థితుల్లో వాడుకోరాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కీలక తీర్పు నేపథ్యంలో యూనిక్‌ అథంటికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) తదుపరి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆధార్‌ ధృవీకరణను రద్దు చేసే ప్లాన్‌ గురించి అక్టోబర్‌ 15 లోగా తమకు తెలియజేయాలని టెలికాం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. దీనిపై వెంటనే నివేదిక అందజేయాలని టెలికాం కంపెనీలను uidai కోరింది.

నోకియా 5.1 ప్లస్ మొబైల్ రూ.10,999 ధరకే త్వరపడండి

టెలికాం సర్వీసు ప్రొవైడర్లు..
 

టెలికాం సర్వీసు ప్రొవైడర్లు..

అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లు వెంటనే 26.09.2018 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించాలంటూ యూనిక్‌ అథంటికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఆధార్‌ ఆధారిత ధృవీకరణ ప్రక్రియ

ఆధార్‌ ఆధారిత ధృవీకరణ ప్రక్రియ

ఈ తీర్పు నేపథ్యంలో ఆధార్‌ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను రద్దు చేసే యాక్షన్‌ ప్లాన్‌/ఎగ్జిట్‌ ప్లాన్‌ను 2018 అక్టోబర్‌ 15లోగా మాకు సమర్పించాలని యూఐడీఏఐ ఆదేశించింది.

భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి జియో వరకు..

భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి జియో వరకు..

సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కంటే ముందు, ప్రతి టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి జియో వరకు తమ మొబైల్‌ యూజర్ల నుంచి తప్పనిసరిగా ఆధార్‌ను లింక్‌ ప్రక్రియను చేపట్టాయి.

మొబైల్‌ నెంబర్లకు

మొబైల్‌ నెంబర్లకు

కొత్త మొబైల్‌ నెంబర్లకు, పాత నెంబర్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆధార్‌ తప్పనిసరి చేశాయి.

బ్యాంక్‌లు సైతం ..
 

బ్యాంక్‌లు సైతం ..

అయితే సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు షాకిస్తూ.. ఆధార్‌ ధృవీకరణను వాడుకోవద్దంటూ ఆదేశించింది. బ్యాంక్‌లు సైతం ఆధార్‌ లింక్‌ను తప్పనిసరి చేయుద్దని తీర్పు వెలువరించింది.

అడ్మిషన్లకు..

అడ్మిషన్లకు..

స్కూల్‌ అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీలకు కూడా ఆధార్‌ అవసరం లేదని తేల్చి చెప్పింది.

ప్రభుత్వ పథకాలకు..

ప్రభుత్వ పథకాలకు..

అయితే ప్రభుత్వ పథకాలకు, పాన్‌ నెంబర్లకు ఆధార్‌ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Telcos asked to submit plan to stop Aadhaar-based verification by October 15 more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X