Home
News

ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేశారా.. అయితే UIDAI ప్రకటన మీకోసమే..!!

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా) మరోసారి గడువును పొడిగించింది. జూలై 14 తేదీతో గడువు ముగియగా.. కొత్తగా డిసెంబర్‌ 14 2024 వరకు ఆధార్‌ కార్డులను (UIDAI Extends Aadhaar Free Update Date) ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. ఆధార్‌ కేంద్రాలు సహా ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ముఖ‌్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేయని వినియోగదారులు వెంటనే చేసుకోవాలని UIDAI సూచించింది. అయితే మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు మరో కీలక ప్రకటన చేసింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి అయినా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

UIDAI extends aadhaar free update date again 2024

ఆధార్‌ కార్డుల అప్‌డేట్‌ గడువును UIDAI ఇప్పటికే అనేక సార్లు పెంచింది. గత సంవత్సరం డిసెంబర్‌ 15 నుంచి మార్చి 14 వరకు.. అనంతరం ఆ గడువును జూన్‌ 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకొనేందుకు గడువు ఇచ్చింది. అయితే తాజాగా డిసెంబర్‌ 14 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది.

ఆధార్‌ కార్డులోని అడ్రస్‌ వివరాలతోపాటు పేర్లు, ఫొటోలు, పుట్టినరోజు వంటి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా అడ్రస్‌ వివరాలను అప్‌డేట్‌ చేయవచ్చు. అదే ఫోటో, పేర్లు మార్చేందుకు ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు.. ఆధార్‌ కార్డుతో లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్‌ కూడా అందుబాటులో ఉండాలి.

ఆధార్‌ కార్డులో అడ్రస్‌ సహా మరిన్ని వివరాలను ఇంట్లో నుంచే మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా అప్‌డేట్‌ చేయవచ్చు. ఇందుకు మొబైల్‌ నంబర్‌ సహా అడ్రస్‌కు సంబంధించిన స్కాన్‌ చేసిన పత్రాలను కలిగి ఉండాలి. వీటిని ఆధార్‌ అప్‌డేట్‌ సమయంలో ఆధార్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌ 1 : UIDAI వెబ్‌సెట్‌ను సందర్శించాలి. తర్వాత Self Service Portal కు నేవిగేట్‌ కావాలి.
స్టెప్‌ 2 : ఆధార్‌ నంబర్‌, Captcha కోడ్, లింక్‌ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఆధారంగా ఆధార్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి.

స్టెప్‌ 3 : లాగిన్‌ చేశాక డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ సెక్షన్‌ను వెళ్లాలి. అందులోని వివరాలను సరిచూసుకోవాలి.
స్టెప్‌ 4 : అప్పటికే మీ వద్ద ఉన్న ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ల స్కాన్ చేసిన ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేయాలి.
స్టెప్‌ 5 : ఆధార్‌లో వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత మీకు ఒక సర్వీస్‌ రిక్వస్ట్‌ నంబర్‌ వస్తుంది. ఆ నంబర్ ఆధారంగా మీ అప్‌డేట్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
UIDAI extends aadhaar free update date again 2024 here are the stepwise guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X