ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలా.. అయితే మీకో గుడ్‌న్యూస్..!
Aadhaar Card Update : ఆధార్ కార్డుదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ ఇవాళ్టి వరకు (జూన్ 14) గడువు ఉండేది. అయితే దీనిపై తాజాగా UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికీ వివరాలను అప్‌డేట్ చేయని వారికి, మరియు త్వరలో అప్‌డేట్ చేయాలని భావిస్తున్నవారికి మేలు జరగనుంది.
ఆధార్ ప్రాధికార సంస్థ X పోస్ట్ వివరాల ద్వారా.. మైఆధార్ పోర్టల్‌లో ఆధార్ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకొనేందుకు మరో సంవత్సరం వరకు అవకాశం ఇచ్చింది. అంటే జూన్ 1, 2026 వరకు మైఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ సేవా కేంద్రాల్లో అప్‌డేట్ చేసేందుకు మాత్రం నగదు చెల్లించాల్సి ఉంటుంది.

గత 10 సంవత్సరాలుగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోని వారు, తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది. అయితే ఆధార్ బయోమెట్రిక్స్, ఫోటో, మొబైల్, ఈ-మెయిల్ వివరాలు అప్‌డేట్ చేసుకొనేందుకు మాత్రం ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది. మిగిలిన సేవలను మైఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
#UIDAI extends free online document upload facility till 14th June 2026; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/XkwZ3owUtw
— Aadhaar (@UIDAI) June 14, 2025
ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి ?
స్టెప్ 1 : ముందుగా myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : అనంతరం ఆధార్ కార్డు నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్ కావాలి.
స్టెప్ 3 : అనంతరం అక్కడ కనిపించిన మీ వివరాలను తనిఖీ చేసుకోవాలి.
స్టెప్ 4 : అప్‌డేట్ చేయాల్సిన వివరాలు ఉంటే, మార్పులు చేయాలి.
స్టెప్ 5 : ఆ తర్వాత అక్కడ కనిపించిన డ్రాప్ డౌన్ మెనూ ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 6 : సంబంధిత డాక్యుమెంట్స్‌ను 2MB కంటే తక్కువ సైజులో JPEG, PNG, PDF ఫార్మాట్స్‌లో అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 7 : అనంతరం చివరిగా Submit ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 8 : సబ్‌మిట్ అయ్యాక 14 అంకెల నంబర్ వస్తుంది.
స్టెప్ 9 : ఈ నంబర్ సాయంతో ఆధార్ అప్‌డేట్ స్టేటస్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఆధార్ వివరాలను ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల ఆధార్ వివరాలు అప్‌డేట్‌గా ఉండడం ఎంతో అవసరం, మొబైల్ నంబర్, అడ్రస్, ఫోటో, పుట్టిన రోజు వివరాలు సరైనవే ఉండేలా చూసుకోవాలి.
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువును UIDAI ఇప్పటికే అనేకసార్లు పొడిగించింది. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 మార్చి 14 వరకు తొలిసారి గడువును పొడిగించింది. అనంతరం 2024 జూన్ 14 వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఉంది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 14 మరియు జూన్ 14 2025 వరకు పొడిగించింది. తాజాగా ఆధార్ అప్‌డేట్ గడువును 2026, జూన్ 14 వరకు పొడిగించింది.


Click it and Unblock the Notifications