నకిలీ ఆధార్ కార్డుల తో మోసం చేస్తున్నారు..! జాగ్రత్త ! ఎలా కనిపెట్టాలి తెలుసుకోండి.

By Maheswara
|

ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు చాలా అవసరమైన పత్రాలలో ఒకటి. ఒక భారతీయుడికి, ఇది గుర్తింపు పత్రం కంటే తక్కువ కాదు. ప్రభుత్వ లావాదేవీల నుండి వ్యక్తిగత ఫైనాన్స్ వరకు, ప్రతిదానికీ మీకు ఆధార్ కార్డు అవసరం అవుతుంది. అలాంటి ఆధార్ కార్డును కూడా కొంతమంది దుండగులు నకిలీవి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే UIDAI సూచనలు మరియు జాగ్రత్తలు జారీ చేసింది.

 

కార్డులో మొత్తం 12 అంకెలు ఉంటాయి

ఆధార్ కార్డులో మొత్తం 12 అంకెలు ఉంటాయి.అలాగని అన్ని 12 సంఖ్యలను ఆధార్‌గా పరిగణించరాదని పేర్కొంటూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఇటీవల ఆధార్ కార్డుకు సంబంధించి ఒక పెద్ద హెచ్చరిక జారీ చేసింది. వాస్తవానికి, కొన్ని నకిలీ ఆధార్ కార్డు నంబర్ల ద్వారా మోసం జరిగినట్లు ఫిర్యాదులు అందిన తరువాత యుఐడిఎఐ ఈ హెచ్చరికను జారీ చేసింది.

సమస్యను పరిష్కరించడానికి

సమస్యను పరిష్కరించడానికి

ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి ఈ సమస్యను UIDAI తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా అందరికి తెలిసేవిధంగా పంచుకుంది. ప్రతి 12 అంకెల సంఖ్య ఆధార్ కార్డు సంఖ్య కాదని పోస్ట్ పేర్కొంది. మీరు ఏదైనా ఆధార్ కార్డు నెంబర్ ను గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్‌ను ధృవీకరించాలని సూచించారు. అందువల్ల, మీకు ఒకరి ఆధార్ అవసరమైతే, ఆ వ్యక్తి ఇచ్చిన ఆధార్ సంఖ్య సరైనదేనా అని ఖచ్చితంగా తనిఖీ చేయండి అని తెలిపారు.

Also Read:ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోవడం ఎలా ?Also Read:ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోవడం ఎలా ?

ఆధార్ సంఖ్యను ఎలా ధృవీకరించాలి
 

ఆధార్ సంఖ్యను ఎలా ధృవీకరించాలి

ఆధార్ ధృవీకరణ ఆన్‌లైన్‌లో సులభంగా చేయవచ్చు. ధృవీకరణ కోసం, UIDAI వెబ్ సైట్ లోని https://resident.uidai.gov.in/verify లింక్ ను సందర్శించాలి. ఈ లింక్ ద్వారా వెళ్ళిన తరువాత మీరు 12 అంకెలు ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి, కాప్చాను నింపిన తర్వాత, ధృవీకరించు బటన్ పై క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత, మీరు తెరపై 12 అంకెల సంఖ్య యొక్క ప్రామాణికతను చూస్తారు. అది సంఖ్యను ధృవీకరించకపోతే, అది నకిలీ ఆధార్ కార్డు అని అర్థం. అలాగే మీరు మోసపోతున్నారనికూడా అర్థం.

సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్నందున

సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్నందున

ఆధార్ కార్డు మీ పేరు, చిరునామా వంటి సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్నందున మరియు మీ బ్యాంక్ ఖాతాలకు మరియు అన్ని ఆర్థిక లావాదేవీలతో అనుసంధానించబడినందున దాని గురించి జాగ్రత్తగా ఉండాలి.

ఆధార్ కార్డు కు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్

ఆధార్ కార్డు కు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్

అలాగే మీ ఆధార్ కార్డు కు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్ ను తెలుసుకోవాలకుంటున్నారా అయితే ఇక్కడ చదవండి.

Read More :మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?Read More :మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?

Most Read Articles
Best Mobiles in India

English summary
UIDAI Issues Warning Regarding Fake Aadhaar Card Numbers. Check How To Verify.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X