New Aadhaar app : ఆధార్ కొత్త యాప్.. ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసా..?
New Aadhaar app : ఆధార్ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఆధార్ సేవల కోసం mAadhaar app యాప్ అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ చేసిన యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ప్రత్యామ్నాయం కాదని తెలిపింది. ఈ కొత్త యాప్ ఫీచర్లు, పూర్తి వివరాలు.
ఆధార్ కొత్త యాప్ ద్వారా.. :
కొత్తగా తీసుకొచ్చిన ఆధార్ యాప్ ద్వారా కాగిత రహితంగా ఈ వివరాలను ఉపయోగించుకొనేందుకు ఉపయోగపడుతుందని ఆధార్ ప్రాధికార సంస్థ తెలిపింది. దీంతోపాటు కొత్త యాప్ ద్వారా ఆధార్ వివరాలను స్టోర్ చేయడం సహా సురక్షితంగా ఇతరులకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.

పాత యాప్‌నకు ప్రత్యామ్నాయం కాదు :
అయితే పాత యాప్ తో కొత్త యాప్ ను పోల్చకూడదని సంస్థ తెలిపింది. mAadhaar యాప్‌నకు ప్రత్యామ్నాయంగా కొత్త ఆధార్ యాప్ ను తీసుకురాలేదని స్పష్టం చేసింది. కొత్త యాప్ తో పోలిస్తే పాత యాప్‌లోనే అనేక ఫీచర్లు ఉన్నాయని తెలిపింది.
పాత యాప్ లో ఏమేం ఉన్నాయంటే :
mAadhaar యాప్ లో డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం, PVC కార్డు కోసం దరఖాస్తు చేయడం, వర్చువల్ ఐడీ ని క్రియేట్ చేయడం సహా మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ను ధ్రువీకరణ చేయడం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఆధార్ కార్డుదారులు PDF లేదా డిజిలాకర్ లో ఆధార్ వివరాలను డిజిటల్ గా భద్రపరుచుకుంటున్నారు.
2 స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ :
అయితే ఈ కొత్త యాప్ ద్వారా మరింత సురక్షితంగా భద్రత ఆధార్ వివరాలను భద్రపరచుకోవచ్చు. 2 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ యాప్ లో మరో ప్రత్యేకత ఉందని UIDAI తెలిపింది. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది.
కుటుంబ సభ్యుల వివరాలు స్టోర్ చేసుకోవచ్చు :
యాప్ లో గరిష్ఠంగా 5 కార్డులను స్టోర్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఆ కార్డులన్నీ ఒకే నంబర్ తో లింక్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు వివరాలను బయోమెట్రిక్ లాక్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఆధార్ కు సంబంధించిన QR కోడ్ లను స్కాన్ చేయవచ్చు.
ఈ రెండింటిలో అందుబాటులో ఉంది :
ప్రస్తుతం ఈ ఆధార్ కొత్త యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నంబర్ ను నమోదు చేసి లాగిన్ కావచ్చు. మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపును పూర్తి చేశాక.. 6 అంకెల పాస్‌వర్డ్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








