ఇకపై మీరు ఆధార్ నంబర్ చెప్పనవసరం లేదు,Virtual IDపై ఓ స్మార్ట్ లుక్కేయండి

ఇప్పుడు Unique Identification Authority of India (UIDAI) ఆధార్ కస్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. 16 నంబర్లతో కూడిన వర్చువల్ రియాలిటీ సిస్టంను ప్రవేశపెడుతోంది.

|

ఇప్పుడు Unique Identification Authority of India (UIDAI) ఆధార్ కస్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. 16 నంబర్లతో కూడిన వర్చువల్ రియాలిటీ సిస్టంను ప్రవేశపెడుతోంది. యూజర్ల అడ్రస్ ని గోప్యంగా ఉంచేందుకు ఈ Virtual ID ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని దీన్ని ఈ ఏడాది లాంచ్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎక్కడైనా మీ 12నంబర్లును చెప్పే అవసరం లేకుండా వర్చువల్ ఐడీ ద్వారా వచ్చే 16 అంకెలను చెబితే సరిపోతుంది. ఈ వర్చువల్ ఐడీని చెప్పినప్పుడు అవతలి వారికి కేవలం మీ పేరు మాత్రమే తెలుస్తుంది. మిగతా వివరాలు వారికి కనిపించవు. మీరు గుర్తింపుగా ఈ Virtual IDని చూపిస్తే సరిపోతుంది. ఇది బీటా ఫామ్‌లో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. . జూన్‌ 1 నుంచి అన్ని సంస్థలు వీఐడీని తప్పనిసరిగా అంగీకరించాలంది. మరి ఇది అప్ డేట్ చేసుకోవడం ఎలా అనే దానిపై ఓ లుక్కేయండి.

 

ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTCప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTC

జూన్‌ 1లోగా...

జూన్‌ 1లోగా...

ఆధార్‌ నంబర్‌కు ప్రత్యామ్నాయంగా వర్చువల్‌-ఐడీ (వీఐడీ) సేవలను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రారంభించింది. 16 అంకెల వీఐడీ-బీటా వర్షన్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. మొబైల్‌ ఆపరేటర్లు, బ్యాంకులు వంటి సర్వీస్‌ ప్రొవైడర్లు జూన్‌ 1లోగా.. వీఐడీ ఆధారిత అథెంటికేషన్‌ సేవలను అందిపుచ్చుకోవాలని ఆదేశించింది.

Virtual ID కావాలంటే..

Virtual ID కావాలంటే..

https://uidai.gov.in లో ‘ఆధార్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌' విభాగంలో.. ‘ఆధార్‌ సర్వీసెస్ 'లో ‘వర్చువల్‌ ఐడీ (వీఐడీ) జనరేటర్‌'ను ఎంచుకోవాలి. కొత్తగా ఓపెన్‌ అయ్యే పేజీలో.. ఆధార్‌ నంబరు, సెక్యూరిటీ కోడ్‌లను పూరిస్తే.. మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది

‘జనరేట్‌ వీఐడీ
 

‘జనరేట్‌ వీఐడీ

ఆ తర్వాత.. అదే పేజీలో ఓటీపీని ఎంటర్‌ చేసి, ‘జనరేట్‌ వీఐడీ' అనే బటన్‌ను క్లిక్‌ చేసి ఎంటర్‌ నొక్కాలి. ఆ వెంటనే మొబైల్‌ నంబరుకు వర్చువల్‌ ఐడీ వస్తుంది.వీఐడీని ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది. ఒకవేళ వీఐడీని మర్చిపోతే తిరిగి పొందే సౌలభ్యం ఉంది. యూఐడీఏఐలో ట్రాకింగ్‌ ఉండదు

ఎలాంటి ఆర్థిక లావాదేవీలను..

ఎలాంటి ఆర్థిక లావాదేవీలను..

ఆధార్‌ కార్డుదారులకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలను ట్రాక్‌ చేయబోమని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది.బీటా వర్షన్‌లో తెచ్చిన వీఐడీని ప్రస్తుతానికైతే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆధార్‌ చిరునామాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. బ్యాంకింగ్, బీమా, మొబైల్‌ లాంటి సేవలు అందించే సంస్థలకు ఆధార్‌ బదులు వీఐడీని చెబితే సరిపోతుంది

Best Mobiles in India

English summary
UIDAI launches 'Virtual ID' to address privacy concerns related to Aadhaar More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X